Ram Charan Party : దీపావళి పార్టీ ఇచ్చిన రాంచరణ్.. వెంకటేశ్, మహేష్, ఎన్టీఆర్ హాజరు.. ఫొటోలు వైరల్

నలుగురు అగ్రహీరోలు ఒకే ఫ్రేమ్ లో కనిపించడంతో వైరల్ అయ్యింది. ఫ్యాన్స్ ఇది చూసి ఫుల్ ఖుషీ అవుతున్నారు.

  • Written By: NARESH
  • Published On:
Ram Charan Party : దీపావళి పార్టీ ఇచ్చిన రాంచరణ్.. వెంకటేశ్, మహేష్, ఎన్టీఆర్ హాజరు.. ఫొటోలు వైరల్

Follow us on

Ram Charan Party : దీపావళిని మన తారలు కూడా ఘనంగా జరుపుకున్నారు. ఆదివారం దేశవ్యాప్తంగా ఈ వేడుకలు ప్రారంభమయ్యాయి. మెగా పవర్ స్టార్ రాంచరణ్ – ఉపాసన దంపతులు తాజాగా ఈ దీపావళి గ్రాండ్ పార్టీని ఏర్పాటు చేశారు. శనివారం రాత్రి హైదరాబాద్ లోని తమ నివాసంలో ఈ వేడుకలు నిర్వహించారు.

తమ కూతురు క్లీంకారకు ఇది తొలి దీపావళి పండుగ కావడంతో రాంచరణ్ దంపతులు ఈ గ్రాండ్ పార్టీని ఏర్పాటు చేసినట్టు సమాచారం. ఈ దీపావళి వేడుకలకు స్టార్ హీరోలు వెంకటేశ్, మహేష్ బాబు-నమ్రత, ఎన్టీఆర్ ప్రణతి దంపతులతోపాటు మంచు లక్ష్మీ, సుధీర్ బాబు ఫ్యామిలీ, సహా టాలీవుడ్ నటీనటులు, దర్శక నిర్మాతలు ఈ పార్టీలో సందడి చేశారు. విందు భోజనం, గేమ్స్ తో అందరూ సరదాగా గడిపారు.

ఈ పార్టీకి సంబంధించిన కొన్ని ఫొటోలను నమ్రత తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయగా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నలుగురు అగ్రహీరోలు ఒకే ఫ్రేమ్ లో కనిపించడంతో వైరల్ అయ్యింది. ఫ్యాన్స్ ఇది చూసి ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Read Today's Latest Pratyekam News, Telugu News LIVE Updates on Oktelugu

సంబంధిత వార్తలు