Chandrababu Dance : ఎప్పుడూ సీరియస్ గా ఉండే పొలిటీషియన్లలో మన చంద్రబాబు ఒకరు. ఆయన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో నవ్వింది చాలా తక్కువ. అలాగే ఏడ్చింది ఒకే ఒకసారి.. జగన్ దెబ్బకు మీడియా ముందర చంద్రబాబు ఏడుపు ఇప్పటికీ ఎవర్ గ్రీన్ గా కనిపిస్తూ ఉంటుంది.
అయితే అంత సీరియస్ గా ఉండే చంద్రబాబుతో కూడా డ్యాన్సులు చేయించాడో పెద్దమనిషి. ఆయనే ఆధ్యాత్మిక గురువు బాబా జగ్గీ వాసుదేవ్. శివుడిని ప్రతిష్టించి తమిళనాడులో ఒక పెద్ద శైవ మఠాన్ని నెలకొల్పిన జగ్గీ వాసు దేవ్ ఏర్పాటు చేసే ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రధాని మోడీ నుంచి అన్ని రాష్ట్రాల సీఎంలు, ప్రతిపక్షాల నేతలు హాజరవుతుంటారు.
అలాగే మన చంద్రబాబు కూడా హాజరయ్యాడు. ఇక వాసుదేవ్ ఆధ్యాత్మిక చింతనలో భక్తి పాటలకు తనదైన శైలిలో స్టెప్పులు వేస్తూ అలరిస్తుంటాడు. ఈ క్రమంలోనే చంద్రబాబుతోపాటు పక్కనున్న రాజకీయ నేతలు కూడా కాలు కదిపి స్టెప్పులు వేశారు.
తొలిసారి చంద్రబాబు చేసిన డ్యాన్స్ వైరల్ అయ్యింది. చంద్రబాబుకు డ్యాన్స్ రాక ఆయన కింద మీదపడుతూ బస్కీలు తీసినట్టు చేసిన డ్యాన్స్ వైరల్ అవుతోంది.
Jamal kudu @ncbn version pic.twitter.com/RUcMAl5pmA
— Manager (@thinkpad8gen) December 10, 2023