Homeఆంధ్రప్రదేశ్‌Deputy CM Pawan Kalyan: పిఠాపురంలో కాన్వాయ్ ఆపి పవన్ చేసిన పనికి అంతా ఫిదా!

Deputy CM Pawan Kalyan: పిఠాపురంలో కాన్వాయ్ ఆపి పవన్ చేసిన పనికి అంతా ఫిదా!

మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పవన్ తనకు కేటాయించిన శాఖల పై నిత్యం స్టడీ చేస్తున్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని ఎప్పటికప్పుడు వెల్లడిస్తున్నారు.

Deputy CM Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ బిజీగా మారారు. కీలక నాలుగు మంత్రిత్వ శాఖలను దక్కించుకున్న ఆయన వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. తమ శాఖలో పురోగతి, ఫలితాలపై మూడు నెలలు టార్గెట్ పెట్టుకున్నారు. కచ్చితంగా గడువులోగా లక్ష్యాలను అధిగమించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు సొంత నియోజకవర్గం పిఠాపురంలో పర్యటనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలతో మమేకమై ఆయన పని చేస్తున్న తీరు ప్రశంసలు అందుకుంటుంది. తాజాగా ఓ చిన్నారిపై కురిపించిన ప్రేమతో పవన్ ప్రజల మనసులను కట్టిపడేశారు. ఇందుకు సంబంధించి ఒక వీడియో వైరల్ అవుతోంది.

మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పవన్ తనకు కేటాయించిన శాఖల పై నిత్యం స్టడీ చేస్తున్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని ఎప్పటికప్పుడు వెల్లడిస్తున్నారు. ప్రజాధనాన్ని ఎలా లూటీ చేశారో వివరిస్తున్నారు. అటు తనను గెలిపించిన పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతున్నారు. సొంత నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ప్రతి గ్రామాన్ని సందర్శించి స్థానికులను కలుస్తున్నారు. ప్రజలు కూడా ఆయనను సాదరంగా ఆహ్వానిస్తున్నారు. భారీ ఎత్తున స్వాగతం పలుకుతున్నారు. పిఠాపురం లో ఓ రోడ్డుపై వెళ్తున్న పవన్ కాన్వాయ్ కు ఎదురుగా ఓ ఐదేళ్ల బాలుడు జనసేన జండా ఊపుతూ కనిపించాడు. వెంటనే కాన్వాయ్ ని ఆపించిన పవన్. ఆ బాలుడు వద్దకు వెళ్లి ప్రేమను కురిపించారు. ఎత్తుకొని దగ్గరకు తీసుకున్నారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

గత మూడు రోజులుగా పిఠాపురంలోనే పవన్ ఉన్నారు. హంగులు ఆర్భాటాలకు దూరంగా తన పర్యటనలను కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఊరేగింపులు తనకు ఇష్టం లేదని చెప్పుకొచ్చిన పవన్.. పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. నియోజకవర్గంలోని మూడు మండలాల్లో జరిగే అధికారిక కార్యక్రమాలకు హాజరవుతున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper