Mirzapur 3
OTT: మరికొద్ది సేపట్లో ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ వెబ్ సిరీస్ వచ్చేస్తుంది. రెండు సీజన్స్ పూర్తి చేసుకున్న సదరు సిరీస్ మూడో సీజన్ తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. అదే మీర్జాపూర్. ఈ వెబ్ సిరీస్ కి ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. 2018లో మొదటి సీజన్ ప్రసారమైంది. 9 ఎపిసోడ్స్ ప్రసారమైన ఈ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ ఆడియన్స్ కి కొత్త అనుభూతిని పంచింది. చెప్పాలంటే A సర్టిఫికెట్ కంటెంట్. ఫోల్ లాంగ్వేజ్, హింస మోతాదు కొంచెం ఎక్కువగా ఉంటుంది.
ఫస్ట్ సీజన్లో పంకజ్ త్రిపాఠి, దివ్యేందు, ఫజల్ అలీ, విక్రాంత్ మాసే, రసిక దుగల్, శ్వేతా త్రిపాఠి ప్రధాన పాత్రలు చేశారు. కరణ్ అన్షుమన్ తెరకెక్కించారు. అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి వచ్చిన సీజన్ 1 బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. దాంతో 2020లో 10 ఎపిసోడ్స్ తో సీజన్ 2 విడుదల చేశారు. సీజన్ 2 సైతం ఆదరణ దక్కించుకుంది. ఈ క్రమంలో సీజన్ 3 అందుబాటులోకి తెచ్చారు.
మీర్జాపూర్ సీజన్ 3 నేటి అర్థరాత్రి నుండి అంటే జులై 5 నుండి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది. ఓటీటీ ప్రేక్షకులు ఈ సిరీస్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మీర్జాపూర్ సీజన్ 3 ట్రైలర్ అద్భుతంగా ఉంది. దాంతో అంచనాలు మరింతగా పెరిగాయి. మీర్జాపూర్ కొత్త కింగ్ ఎవరు? గుడ్డు భయ్యా సింహాసనం దక్కించుకున్నాడా? మున్నా భయ్యా బ్రతికే ఉన్నాడా? అనే ఆసక్తికర అంశాల సమాహారమే మీర్జాపూర్ సీజన్ 3.
అలీ ఫజల్, పంకజ్ త్రిపాఠి, విజయ్ వర్మ, శ్వేతా త్రిపాఠి ప్రధాన పాత్రలు చేశారు. సీజన్ 3 కథ విషయానికి వస్తే… ఒకప్పుడు మీర్జాపూర్ కాలీన్ భాయ్(పంకజ్ త్రిపాఠి) కనుసన్నల్లో నడిచేది. తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో గుడ్డు(అలీ ఫజల్)మీర్జాపూర్ పై ఆధిపత్యం సంపాదిస్తాడు. కాలీన్ భాయ్ ఆనవాళ్లు లేకుండా గుడ్డు చేస్తాడు. అయితే కాలీన్ భాయ్ తిరిగి మీర్జాపూర్ పై ఆధిపత్యం కోసం పావులు కడుపుతాడు. గుడ్డుకు చెక్ పెట్టేందుకు ప్రణాళికలు వేస్తాడు… మరి వీరిద్దరిలో మీర్జాపూర్ ఎవరిది అనేది మిగతా కథ..
Web Title: Mirzapur 3 release date cast storyline where to watch the revenge thriller
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com