Money Plant: హిందూమతంలో వాస్తుకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అందుకే ఏ వస్తువును పెట్టిన కానీ వాస్తు చూసి మరీ పెడుతుంటారు. అందులో భాగంగా మనీ ప్లాంట్ ను కూడా వాస్తు ప్రకారం పెట్టాలి అంటున్నారు నిపుణులు. ఈ చెట్టును సరైన దిశలో నాటడం వల్ల ఆనందం, కీర్తి, శాంతి లభిస్తాయట. అయితే మనీ ప్లాంట్లను నాటడం వల్ల కలిగే అనేక ప్రయోజనాలను వాస్తు గ్రంధాలు పేర్కొంటున్నాయి. అయితే ఈ మనీ ప్లాంట్ ను సరైన దిశలో మాత్రమే పెట్టాలని, లేదంటే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటున్నారు నిపుణులు.
చాలా మంది ఇంట్లో మనీ ప్లాంట్ ను నాటుతుంటారు. ఇంటి అందం కోసం ఈ ప్లాంట్ ను నాటుతుంటారు. అయితే మీరు కూడా మీ ఇంట్లో మనీప్లాంట్ ను నాటితే దాన్ని ఉత్తర దిశలో ఉంచండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి ఏర్పడుతుంది. అంతేకాదు ఇల్లు సంపదతో నిండి ఉంటుంది.
ఈ దిక్కు శ్రేయస్కరం కాదు: వాస్తు శాస్త్రం ప్రకారం.. మనీ ప్లాంట్ ఈశాన్య దిశలో పెట్టవద్దు. ఈ దిక్కున మనీ ప్లాంట్ నాటితే ఆర్థిక సమస్యలు వస్తాయి అంటున్నారు నిపుణులు. ఇంట్లో ప్రతికూల వాతావరణం ఏర్పడుతుందట. అయితే మనీ ప్లాంట్ ను నాటడం వల్ల ఇల్లు బాగుంటుందని, ఆనందం, శ్రేయస్సు, శాంతి కూడా ఉంటుంది అంటున్నారు నిపుణులు. ఈ చెట్టు వల్ల మీ జీవితంలో వెలుగులు వస్తాయి.
ఇలా చేయండి: మీకు ఆర్థిక సమస్యలు ఉంటే పచ్చిపాలను నీటిలో కలిపి శుక్రవారం రోజు మనీ ప్లాంట్ లో పోయండి. దీని వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందట. మనీ ప్లాంట్ దగ్గర ఎర్రటి దారాన్ని కడితే డబ్బు కొరత భర్తీ అవుతుంది అంటున్నారు వాస్తు నిపుణులు.
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Read MoreWeb Title: Have a money plant at home do this
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com