PM Kisan Yojana
PM Kisan Yojana: వ్యవసాయాభివృద్ధికి, రైతుల సంక్షేమం కోసం 2019లో కేంద్రం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రారంభించింది. చిన్న, సన్నకారు రైతులను ఆర్థికంగా ఆదుకోవడమే లక్ష్యంగా ఏటా రూ.6 వేల పెట్టుబడి సాయం అందిస్తోంది. మూడు విడతల్లో ఈ సాయాన్ని రైతుల ఖాతాల్లో నేరుగా సమ చేస్తోంది. ఇదిలా ఉంటే.. మోదీ 3.0 పాలనలో రైతులకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఈక్రమంలో 2024–24 బడ్జెట్‌లో వ్యవసాయరంగానికి కేటాయింపులపై కసరత్తు చేస్తోంది. ఈమేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యవసాయ రంగ నిపుణులతో సమావేశమయ్యారు. ఈ బడ్టెట్‌లో పీఎం–కిసాన్ కింద అందించే ఆర్థికసాయాన్ని రూ.6 వేల నుంచి రూ.8 వేలకు పెంచాలని నిపుణులు సూచించారు. అదే విధంగా వ్యవసాయ పరిశోధనలకు అదనపు నిధులు, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ద్వారా నేరుగా రైతులకు అన్ని రాయితీలు ఇవ్వాలని కూడా ప్రతిపాదించారు.
11 కోట్ల మంది రైతులకు లబ్ధి..
పీఎం కిసాన్ సమ్మాన్ పథకం ద్వారా ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 11 కోట్ల మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. వీరికి ఏడాదికి మూడు విడతల్లో రూ.2 వేల చొప్పున మొత్తం రూ.6 వేలు నేరుగా ఖాతాల్లో జమ చేస్తోంది. 2019 నుంచి ఇప్పటి వరకు రైతులకు రూ.3.24 లక్షల కోట్లు చెల్లించారు. మోదీ మూడోసారి ప్రధాని అయ్యాక పిఎం కిసాన్ నిధి ఫైల్‌పైనే తొలి సంతకం చేవారు. 17వ విడత నిధులు విడుదల చేశారు. ఈ విడతలో 9.3 కోట్ల మంది రైతులకు దాదాపు రూ.20 వేల కోట్లు పంపిణీ చేశారు.
బడ్జెట్‌లో కేటాయింపులు పెంపు..
ఇదిలా ఉంటే.. కేంద్రం ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో 2024–25లో వ్యవసాయానికి రూ.1.27 లక్షల కోట్లు కేటాయించింది. ఈనెల 23 లేదా 24న పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకే కేంద్రం కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో ఈ బడ్జెట్‌లో వ్యవసాయరంగానికి అదనపు కేటాయింపులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మోదీ ఇప్పటికే రైతులకు అధిక ప్రాధాన్యం ఇస్తామని ప్రకటించారు. ఆమేరకు వ్యవసాయరంగానికి బడ్జెట్‌లో ఎక్కువ ప్రాధాన్యం దక్కుతుందని తెలుస్తోంది.
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: 8 thousand rupees into the accounts of the farmers
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com