Kalki Collections: బాక్సాఫీస్ వద్ద కల్కి జోరు కొనసాగుతోంది. పని దినాల్లో కూడా కల్కి చిత్ర వసూళ్లు స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఫస్ట్ వీక్ పూర్తి చేసుకున్న కల్కి రూ. 700 కోట్ల వసూళ్లు రాబట్టినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే కల్కి లాభాల్లోకి రావాలంటే ఇంకా వసూళ్లు రాబట్టాల్సి ఉంది. మొదటి నుండి కల్కి చిత్రం పై భారీ హైప్ ఏర్పడింది. అదే స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. కల్కి ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు పరిశీలిస్తే.. నైజాం లో రూ. 65 కోట్లకు అమ్మారు. సీడెడ్ రూ. 27 కోట్లు, ఆంధ్ర రూ. 76 కోట్ల బిజినెస్ చేసింది.
తెలుగు రాష్ట్రాల్లో కల్కి రూ. 168 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. కర్ణాటకలో రూ. 25 కోట్లు, తమిళనాడు రూ. 16 కోట్లు, కేరళ రూ. 6 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. కల్కి హిందీ హక్కులను రూ. 85 కోట్లకు విక్రయించారు. ఓవర్సీస్ హక్కులు రూ. 70 కోట్లు పలికాయి. వరల్డ్ వైడ్ రూ. 370 కోట్ల బిజినెస్ జరిగినట్లు సమాచారం. అంటే కల్కి రూ. 371 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలో దిగింది.
ఇక 7 రోజులకు కల్కి రాబట్టిన వసూళ్లు పరిశీలిస్తే… ఏడవ రోజు కల్కి ఏపీ/తెలంగాణాలలో రూ. 5 కోట్ల షేర్ వసూలు చేసింది. ఓవర్సీస్ తో పాటు రెస్టాఫ్ ఇండియా మరో రూ. 15 కోట్ల షేర్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాల అంచనా. మొదటి వారం ముగిసే నాటికి కల్కి రూ. 335 కోట్ల షేర్ రాబట్టింది. కాబట్టి ఇంకా బ్రేక్ ఈవెంట్ కి దూరంలోనే కల్కి చిత్రం ఉంది. మరో రూ. 36 కోట్ల షేర్ వసూలు చేస్తే కానీ కల్కి లాభాలలోకి ఎంటర్ కాదు.
ఓవర్సీస్ లో కల్కి భారీ లాభాలు పంచింది. యూఎస్ లో రూ. 100 కోట్ల వసూళ్లు దాటేసింది. ఇప్పటికే $12 మిలియన్ వసూళ్లను అధిగమించింది. తమిళనాడు, కేరళలో కల్కి చిత్రానికి పెద్దగా స్పందన లేదు. ఆ రెండు ఏరియాల్లో ప్లాప్ దిశగా వెళుతుంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా కొన్ని ఏరియాల్లో కల్కి బ్రేక్ ఈవెన్ చేరుకోలేదు. వచ్చే వారం కూడా కల్కి చిత్రానిదే. బాక్సాఫీస్ వద్ద ఎలాంటి పోటీ లేదు. ప్రభాస్ హీరోగా నటించిన కల్కి చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే..
Web Title: Kalki movie 7 days box office collections
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com