Prabhas – Ramcharan : ‘కామిక్ కాన్’ వేదికపై రామ్ చరణ్ తో మల్టీస్టార్రర్ సినిమాని ప్రకటించిన ప్రభాస్.. ఫ్యాన్స్ కి ఇక పండగే!

అప్పుడు ప్రభాస్ ‘రామ్ చరణ్ నాకు మంచి స్నేహితుడు, త్వరలోనే మేమిద్దరం కలిసి ఒక సినిమా చేస్తాము కచ్చితంగా’ అని చెప్పుకొచ్చాడు. ప్రభాస్ ఇండస్ట్రీ లో చాలా తక్కువ మందితో మాత్రమే స్నేహం చేస్తాడు. వారిలో ఒకరు రామ్ చరణ్. చరణ్ ప్రభాస్ కి ఎంత మంచి స్నేహితుడు అనే విషయం వీళ్లిద్దరు ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ ప్రోగ్రాం లో క్లోజ్ గా మాట్లాడుకున్నప్పుడు అందరికీ అర్థం అయ్యింది.

  • Written By: Vicky
  • Published On:
Prabhas – Ramcharan : ‘కామిక్ కాన్’ వేదికపై రామ్ చరణ్ తో మల్టీస్టార్రర్ సినిమాని ప్రకటించిన ప్రభాస్.. ఫ్యాన్స్ కి ఇక పండగే!

Follow us on

Prabhas – Ramcharan : యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘ప్రాజెక్ట్ K’ కి సంబంధించిన గ్లిమ్స్ వీడియో ని ఈరోజు తెల్లవారుజామున విడుదల చేసిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఇన్ని రోజులు ‘ప్రాజెక్ట్ K’ గా పిలవబడిన ఈ సినిమాని ఇక నుండి ‘కల్కి 2898 – AD ‘ గా టైటిల్ ని మార్చామని ఈ గ్లిమ్స్ లో చెప్పుకొచ్చాడు. ఈ గ్లిమ్స్ వీడియో ని అమెరికా లో ‘కామిక్ కాన్’ వేదిక పై గ్రాండ్ విడుదల చేసారు.

ఈ ఈవెంట్ కి ప్రభాస్ తో పాటుగా కమల్ హాసన్, రానా దగ్గుపాటి, చిత్ర డైరెక్టర్ నాగ అశ్విన్ తదితరులు హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో ప్రభాస్, కమల్ హాసన్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ప్రభాస్ ని ఒక మీడియా ప్రతినిధి #RRR హీరో రామ్ చరణ్ తో సినిమా ఎప్పుడు చెయ్యబోతున్నారు అని అడుగుతాడు.

అప్పుడు ప్రభాస్ ‘రామ్ చరణ్ నాకు మంచి స్నేహితుడు, త్వరలోనే మేమిద్దరం కలిసి ఒక సినిమా చేస్తాము కచ్చితంగా’ అని చెప్పుకొచ్చాడు. ప్రభాస్ ఇండస్ట్రీ లో చాలా తక్కువ మందితో మాత్రమే స్నేహం చేస్తాడు. వారిలో ఒకరు రామ్ చరణ్. చరణ్ ప్రభాస్ కి ఎంత మంచి స్నేహితుడు అనే విషయం వీళ్లిద్దరు ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ ప్రోగ్రాం లో క్లోజ్ గా మాట్లాడుకున్నప్పుడు అందరికీ అర్థం అయ్యింది. మన స్నేహితుల మధ్య ఎలాంటి మాటలు అయితే ఉంటాయో, అలాంటి సంభాషణే వీళిద్దరి మధ్య ఆరోజు జరిగింది. ఇలాంటి స్నేహితులు కలిసి ఒక సినిమా చేస్తే కచ్చితంగా ఇరువురి హీరోల అభిమానులకు ఒక కనుల పండుగ లాగానే ఉంటుంది.

పాన్ వరల్డ్ రేంజ్ లో స్టార్ స్టేటస్ దక్కించుకున్న ఈ ఇద్దరు హీరోల మల్టీస్టార్ర్ర్ సినిమా చేసే అదృష్టం ఏ డైరెక్టర్ కి కలుగుతుందో చూడాలి. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో సలార్ , కల్కి , స్పిరిట్ వంటి సినిమాలు ఉన్నాయి. అలాగే రామ్ చరణ్ గేమ్ చేంజర్, బుచ్చి బాబుతో ఒక సినిమా , అలాగే సుకుమార్ తో ఒక సినిమా చెయ్యబోతున్నాడు. ఈ ప్రాజెక్ట్స్ మొత్తం పూర్తి అయ్యాకే వీళ్లిద్దరి కాంబినేషన్ సెట్స్ మీదకి వెళ్లే అవకాశం ఉంటుంది.

Read Today's Latest Entertainment News, Telugu News LIVE Updates on Oktelugu

సంబంధిత వార్తలు