Prabhas Kalki to Premiere at World Largest IMAX Theater
Kalki Movie: ప్రభాస్ ప్రధాన పాత్రలో వచ్చిన ‘ కల్కి ఏడీ 2898 ‘ మూవీ వరల్డ్ వైడ్ గా సెన్సేషన్ సృష్టిస్తుంది. బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల మోత మోగిస్తుంది. అనేక రికార్డులు కొల్లగొడుతుంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ. 900 వందల కోట్లకు పైగా వసూలు చేసింది. రూ. 1000 కోట్ల దిశగా దూసుకుపోతుంది. కాగా కల్కి మూవీ కి ఒక అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచంలోనే అతి పెద్ద ఐమ్యాక్స్ థియేటర్ లో కల్కి సినిమా ప్రదర్శించనున్నారు.
దీనికి సంబంధించిన పోస్టర్ చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ సినిమా జూలై 13న కాలిఫోర్నియాలోని టీసీఎల్ చైనీస్ థియేటర్ లో ప్రదర్శించనున్నారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఐమ్యాక్స్ స్క్రీన్ గా పేరుగాంచింది. ఈ స్క్రీన్ పొడవు 27 మీటర్లు. ఈ థియేటర్ లో ఒకేసారి 932 మంది వరకు కూర్చుని సినిమా వీక్షించేలా రూపొందించబడింది. ఈ థియేటర్ బయట నుంచి చూడటానికి చైనీస్ స్టైల్ లో ఉంటుంది. 1927లో ఈ థియేటర్ ను ప్రారంభించారు. మరో మూడేళ్ళలో ఈ థియేటర్స్ వందేళ్ళు పూర్తి చేసుకోనుంది.
ఇక ఈ స్పెషల్ స్క్రీనింగ్ లో దర్శకుడు నాగ అశ్విన్ కూడా భాగం కానున్నారు. మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి ని వైజయంతి బ్యానర్ పై అశ్వినీ దత్ నిర్మించారు. సంతోష్ నారాయణ్ సంగీతం అందించారు. లెజెండరీ నటులు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రలు పోషించారు. బాలీవుడ్ భామలు దీపికా పదుకొనే, దిశా పటాని హీరోయిన్లుగా నటించారు. రాజేంద్రప్రసాద్, శోభన ముఖ్య పాత్రల్లో కనిపించారు.
అలాగే రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ, మృణాల్ ఠాకూర్, విజయ్ దేవరకొండ, బ్రహ్మానందం,దుల్కర్ సల్మాన్ కేమియో రోల్స్ లో మెరిశారు. ఇప్పటికే కల్కి మూవీ చూసిన సినీ ప్రముఖులు నాగ్ అశ్విన్ ప్రతిభను కొనియాడుతున్నారు. కల్కి విజువల్ వండర్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. బాహుబలి 2 తర్వాత ప్రభాస్ కల్కి తో క్లీన్ హిట్ కొట్టాడు. కల్కి 2 కూడా ప్రకటించారు. కొంత మేర షూటింగ్ సైతం జరుపుకుంది.
Web Title: Prabhas kalki to premiere at worlds largest imax theater
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com