Pawan Kalyan: విజయేంద్ర ప్రసాద్ కథతో వస్తున్న పవర్ స్టార్…సీఎం గా కనిపించబోతున్న పవన్ కళ్యాణ్…

పొలిటికల్ డ్రామాకు సంబంధించిన ఒక స్టోరీని రాసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఆ స్టోరీ పవన్ కళ్యాణ్ కి అయితే బాగా సెట్ అవుతుందని అనుకొని ఆయన చాలా మంది ప్రొడ్యూసర్లతో చెప్పినట్టుగా తెలుస్తుంది.

  • Written By: Gopi
  • Published On:
Pawan Kalyan: విజయేంద్ర ప్రసాద్ కథతో వస్తున్న పవర్ స్టార్…సీఎం గా కనిపించబోతున్న పవన్ కళ్యాణ్…

Follow us on

Pawan Kalyan: తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా రేంజ్ లో స్టార్ట్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన రాజమౌళి ప్రస్తుతం పాన్ ఇండియ రేంజ్ లో మహేష్ బాబుతో ఒక సినిమా చేస్తున్నాడు. ఇక వీళ్ళ నాన్న అయిన విజయేంద్రప్రసాద్ గురించి ప్రత్యేకం చెప్పాల్సిన పని లేదు ఎందుకంటే రాజమౌళి చేసిన అన్ని సినిమాలకి కథలను అందించి ప్రస్తుతం బెస్ట్ కథ రచయిత గా పేరు తెచ్చుకున్నాడు.

ఇక ఇప్పుడు ఈయన పొలిటికల్ డ్రామాకు సంబంధించిన ఒక స్టోరీని రాసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఆ స్టోరీ పవన్ కళ్యాణ్ కి అయితే బాగా సెట్ అవుతుందని అనుకొని ఆయన చాలా మంది ప్రొడ్యూసర్లతో చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఆ కథ మొత్తాన్ని రెడీ చేసి పవన్ కళ్యాణ్ కోసం సిద్దం చేసి పెట్టినట్టు గా తెలుస్తుంది. అయితే ఈ కథ పవన్ కళ్యాణ్ కి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది అని కొంతమంది ప్రొడ్యూసర్లు కూడా చెప్పడంతో పవన్ కళ్యాణ్ కి ఈ కథ చెప్పడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

అయితే ఇప్పుడు ఎలక్షన్స్ బిజీ లో ఉన్న పవన్ కళ్యాణ్ కొంచం ఫ్రీ అయిన తర్వాత కథ వింటాను అని విజయేంద్రప్రసాద్ తో చెప్పినట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. ఇక ఇప్పటికే వీళ్ళ కాంబినేషన్ లో విక్రమార్కుడు అనే సినిమా రావాల్సింది కానీ పవన్ కళ్యాణ్ బిజీగా ఉండడం వల్ల ఆ సినిమా అనేది మిస్ అయింది. కానీ ఇప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ కి విజయేంద్రప్రసాద్ రాసిన కథను చెప్పి ఆయన్ని ఒప్పించి ఆయన తో ఈ సినిమా చేయించాలని చూస్తున్నారు. అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సిఎం గా కనిపించబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ కథను ఎవరు డైరెక్షన్ చేస్తారు అనే దాని మీదనే ఇప్పుడు సర్వత్ర ఆసక్తి నెలకొంది.

ప్రస్తుతం విజయేంద్రప్రసాద్ డైరెక్షన్ చేసే స్టేజ్ లో లేడు కాబట్టి ఈ కథకి ఒక యంగ్ డైరెక్టర్ ని డైరెక్టర్ గా అపాయింట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి ఈ సినిమాని బాగా తీయాలంటే ఒక మంచి డైరెక్టర్ కూడా ఉండాలి. అలా అయితేనే విజయేంద్ర ప్రసాద్ రాసిన కథకి న్యాయం జరుగుతుంది. రాజమౌళి లాంటి డైరెక్టర్ ఈ ప్రాజెక్టుని టేక్ ఆఫ్ చేయొచ్చు కానీ ప్రస్తుతం ఆయనకున్న కమిట్ మెంట్ల వలన ఈ ప్రాజెక్టుని చేయలేడు అనేది స్పష్టంగా తెలిసిపోతుంది.మారి పవన్ కళ్యాణ్ ని హ్యాండిల్ చేసే డైరెక్టర్ ఇండస్ట్రీ ఎవరు ఉన్నారు అనేది ఇప్పుడు చాలా హాట్ టాపిక్ గా మారింది…

Read Today's Latest Entertainment News, Telugu News LIVE Updates on Oktelugu

సంబంధిత వార్తలు