లాడ్జీ, ఇల్లీగల్ ఎఫైర్ వివాదం: తీన్మార్ మల్లన్నపై కేసు

తెలంగాణ సీఎం కేసీఆర్ ను, టీఆర్ఎస్ విధానాలను సోషల్ మీడియాలో చెడుగుడు ఆడేసే తీన్మార్ మల్లన్నపై పోలీసులు దాడి చేశారు. తెలంగాణలో అధికార టీఆర్ఎస్ ను తీవ్రంగా విమర్శిస్తూ యూట్యూబ్ లో వీడియోల ద్వారా ప్రశ్నిస్తున్న ప్రముఖ జర్నలిస్ట్, సోషల్ మీడియా ఉద్యమకారులు తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ పై హైదరాబాద్ సైబర్ క్రైం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. తీన్మార్ మల్లన్న నేతృత్వంలో నడుస్తున్న ‘క్యూ న్యూస్’ చానెల్ లో తన […]

  • Written By: NARESH
  • Published On:
లాడ్జీ, ఇల్లీగల్ ఎఫైర్ వివాదం: తీన్మార్ మల్లన్నపై  కేసు

Follow us on

తెలంగాణ సీఎం కేసీఆర్ ను, టీఆర్ఎస్ విధానాలను సోషల్ మీడియాలో చెడుగుడు ఆడేసే తీన్మార్ మల్లన్నపై పోలీసులు దాడి చేశారు. తెలంగాణలో అధికార టీఆర్ఎస్ ను తీవ్రంగా విమర్శిస్తూ యూట్యూబ్ లో వీడియోల ద్వారా ప్రశ్నిస్తున్న ప్రముఖ జర్నలిస్ట్, సోషల్ మీడియా ఉద్యమకారులు తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ పై హైదరాబాద్ సైబర్ క్రైం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.

తీన్మార్ మల్లన్న నేతృత్వంలో నడుస్తున్న ‘క్యూ న్యూస్’ చానెల్ లో తన వ్యక్తిగత ఫొటోలను చూపించి పరువుకు భంగం కలిగించారంటూ ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్ఫర్మేషన్ యాక్ట్ 67, ఐపీసీ 506, 509 ,417 సెక్షన్ల కింద ఈనెల 2న కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ మేరకు మంగళవారం రాత్రి మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫీర్జాది గూడలో ఉన్న క్యూ న్యూస్ కార్యాలయంలో సైబర్ క్రైం పోలీస్ ఇన్ స్పెక్టర్లు బృందాలు సోదాలు నిర్వహించాయి. ఈ సోదాలు పలు కీలక పత్రాలు, ఎలక్ట్రానిక్ డివైజ్ లను స్వాధీనం చేసుకున్నారు. వీటిల్లో క్యూ న్యూస్ ఉద్యోగులతోపాటు మరికొందరు బాధితుల వివరాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

బాధిత యువతి ఫిర్యాదు మేరకు ఈ దాడులు నిర్వహించి తీన్మార్ మల్లన్నపై పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ‘క్యూ న్యూస్ చానెల్ లో నేను జనవరి 2020 నుంచి అదే ఏడాది ఆగస్టు వరకు రిపోర్టర్ గా పనిచేసినట్టు ఆమె తెలిపింది. ఆ సమయంలో తీన్మార్ మల్లన్న విధానాలు, ట్రిక్కులు నచ్చక ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు తెలిపింది. తీన్మార్ మల్లన్న సోదరుడు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ వెంకటేశ్ , మరికొందరు సాఫ్ట్ వేర్ ఉద్యోగుల సహాయంతో కొన్ని అక్రమ అప్లికేషన్స్ ను రూపొందించి వాటి ద్వారా చాలా మంది వ్యక్తిగత సమాచారాన్ని క్యూ న్యూస్ ఉద్యోగుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించారని తెలిపారు. దాని ఆధారంగా చాలా మందిపై బెదిరింపులకు పాల్పడేవాడని తెలిపారు. ఈనెల 1న ఉదయం క్యూ న్యూస్ చానెల్ లో మార్నింగ్ లైవ్ సోలో నాతోపాటు మరికొందరి అమ్మాయిల ఫొటోలను చూపాడని బాధిత యువతి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఇక తనకు చిలుక ప్రవీణ్ తో వివాహేతర సంబంధం ఉన్నట్టు చూపించాడని బాధిత యువతి తెలిపింది. చిలుక ప్రవీణ్ తో విభేదాల కారణంగా అతడిని బ్లాక్ మెయిల్ చేసేందుకు నా ఫొటోలు వాడుకున్నాడని.. ఆ వీడియోలను ‘లాడ్జ్ వ్యవహారం’ పేరిట సోషల్ మీడియాలో రిలీజ్ చేశాడని బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఈ ఫొటోలు, వీడియోల కారణంగా నా కుటుంబానికి ఉన్న విశ్వసనీయత, గౌరవానికి భంగం కలిగిందని.. బాధ్యుడైన తీన్మార్ మల్లన్నపై తగిన చర్యలు తీసుకోవాలని బాధిత యువతి పేర్కొన్నది. చిలుక ప్రవీణ్ తో ఆఫీసులో దిగిన ఫొటోలను తీన్మార్ మల్లన్న అక్రమ సంబంధంగా చిత్రీకరించాడని బాధితురాలు ఆరోపించింది.

ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసిన పోలీసులు తీన్మార్ మల్లన్న కార్యాలయంలో దాడి చేసి ఆయనపై కేసు నమోదు చేశారు.

Read Today's Latest Telangana politics News, Telugu News LIVE Updates on Oktelugu

సంబంధిత వార్తలు