Ante Sundaraniki: అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు హిట్ టాక్ తెచ్చుకొని కూడా నాని సినిమాలు కమర్షియల్ గా ఆడడం లేదు. జెర్సీ, గ్యాంగ్ లీడర్ ఈ కోవకు చెందినవే. శ్యామ్ సింగరాయ్ మూవీ పరిస్థితి అలానే అయ్యింది. ఈ మూవీ అఖండ, పుష్ప చిత్రాల మధ్యలో నలిగిపోయింది. భారీ కలెక్షన్స్ సాధిస్తుందనుకుంటే బ్రేక్ ఈవెన్ కూడా కష్టమైంది. అఖండ, పుష్ప శ్యామ్ సింగరాయ్ కంటే ముందే విడుదలయ్యాయి. బ్లాక్ బస్టర్ టాక్ నేపథ్యంలో లాంగ్ రన్ కొనసాగించాయి. అఖండ, పుష్ప కారణంగా నాని మూవీ భారీగా నష్టపోయింది. కొంచెం ఆగి 2022 సంక్రాంతి బరిలో దిగితే ఆ మూవీ రిజల్ట్ మరోలా ఉండేది.
Ante Sundaraniki
పోటీలేని బంగార్రాజు సంక్రాంతి సీజన్ క్యాష్ చేసుకుంది. పెద్దగా కంటెంట్ లేకున్నా మంచి వసూళ్లు సాధించింది. కాగా నాని లేటెస్ట్ మూవీ అంటే సుందరం చిత్రానికి కూడా ఇలాంటి సవాల్ ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. గత వారం విడుదలైన మేజర్, విక్రమ్ చిత్రాలు బాక్సాఫీస్ షేక్ చేస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో విక్రమ్, మేజర్ చిత్రాల వసూళ్లు సాలిడ్ గా ఉన్నాయి. వీక్ డేస్ లో కూడా కలెక్షన్స్ నెమ్మదించడం లేదు.
Also Read: Mahesh Babu Trivikram Movie: తీవ్ర నిరాశలో మహేశ్..: వెంటనే మార్చాలని చెప్పిన హీరో..
ముఖ్యంగా విక్రమ్ క్లాస్ మాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది. ఐదు రోజులకే బ్రేక్ ఈవెన్ అయిన ఈ చిత్రం నిర్మాతలకు లాభాలు కురిపిస్తుంది. ఇక వరల్డ్ వైడ్ గా విక్రమ్ బాక్సాఫీస్ కలెక్షన్స్ రూ. 200 కోట్లను దాటివేశాయి. విడుదలైన అన్ని భాషల్లో విక్రమ్ కలెక్షన్స్ దుమ్ముదులుపుతుంది. చాలా కాలంగా నిద్రాణంగా ఉన్న కమల్ ఫ్యాన్స్ ని విక్రమ్ మేల్కొలిపింది.
Ante Sundaraniki
అలాగే మేజర్ వసూళ్లు నిలకడగా సాగుతున్నాయి. విక్రమ్, మేజర్ చిత్రాల ప్రభంజనం కొనసాగుతుండగా నాని ‘అంటే సుందరానికి’ చిత్రంతో దిగుతున్నాడు. ఈ క్రమంలో నాని మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా కొంతలో కొంత వసూళ్లు కోల్పోవడం ఖాయం. ఇక నెగిటివ్ టాక్ వస్తే మూవీని ఎవరూ కాపాడలేరు. విక్రమ్, మేజర్ చిత్రాల నుండి నాని గట్టి పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ విషయం నానితో పాటు అంటే సుందరానికి మేకర్స్ ని భయపెడుతుంది. ఈ కఠిన పరిస్థితులను నాని అండ్ కో ఎలా ఎదుర్కొంటారో చూడాలి.
బ్రోచేవారెవరురా మూవీతో ఫేమ్ రాబట్టిన వివేక్ ఆత్రేయ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు. నానికి జంటగా మలయాళ హీరోయిన్ నజ్రియా ఫహాద్ నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు. జూన్ 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
Also Read:AP SSC Results 2022: ఏపీలో తగ్గిన పదో తరగతి ఉత్తీర్ణత శాతం.. కారణాలు అవేనా?
Recommended Videos