Actor Darshan : ఒక తప్పు మన వల్ల జరిగినప్పుడు.. ఎంతో కొంత ప్రాయశ్చిత్తం ఉండాలి.. అపరాధ భావం కనిపించాలి. అది ఒక మనిషి సహజ లక్షణం కూడా. కానీ ఈమె వాటికి అతీతురాలు. తన వల్ల తప్పు జరిగినప్పటికీ ఏమాత్రం ప్రాయశ్చిత్తం లేదు. కనీసం అపరాధ భావం కూడా ఆమె ముఖంలో కనిపించడం లేదు. అగ్నిసాక్షిగా తాళి కట్టిన భర్తను పక్కన పెట్టింది. ఒక సినీ హీరోను తన వలలో వేసుకుంది. చివరికి అతడిని తన భార్యకు దూరం చేసింది. అంతేకాదు నిండు గర్భిణిగా ఉన్న ఓ మహిళ భర్తను చంపించింది. ఇన్ని చేసినప్పటికీ ఆమెలో కొంచెం కూడా తప్పు చేశాననే భావన లేదు. అపరాధ భావం అంతకన్నా లేదు.. పైగా కస్టడీలో మేకప్ వేసుకుంది. లిప్స్టిక్ పూసుకుంది.. ఆ మహానటి చేసిన ఘనకార్యానికి మహిళా ఎస్సై నోటీసులు అందుకోవాల్సి వచ్చింది.
కర్ణాటకలో రేణుకాస్వామి హత్య కేసు సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు. రేణుకా స్వామిని హత్య చేయించింది కన్నడ నటుడు దర్శన్ అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కర్ణాటక పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి.. దర్శన్, అతని ప్రియురాలు పవిత్ర గౌడ, రాఘవేంద్ర, ఇంకా 8 మంది నిందితులను అరెస్టు చేసింది. రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించింది. అయితే ఈ కేసులో రోజుకో తీరుగా సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.. పవిత్ర గౌడ రాకతోనే దర్శన్ వ్యక్తిగత జీవితం నాశనమైందని, అతడి భార్య, కొడుకు ఇబ్బంది పడుతున్నారని రేణుకా స్వామి(దర్శన్ వీరాభిమాని) సోషల్ మీడియాలో ఆరోపించేవాడు.. పైగా పవిత్ర గౌడ ను ఇన్ స్టా గ్రామ్ లో బెదిరించేవాడు. అయినప్పటికీ పవిత్ర గౌడ దర్శన్ ను వదిలి పెట్టకపోవడంతో.. ఆమెకు అశ్లీల సందేశాలు, చిత్రాలు పంపించినట్టు తెలుస్తోంది. దీంతో అతనిపై పగ పెంచుకున్న పవిత్ర గౌడ.. ఈ విషయాన్ని దర్శన్ తో చెప్పింది. దీంతో దర్శన్ రేణుకా స్వామిని పిలిపించి.. కొంతమంది వ్యక్తులతో కలిసి హత్య చేయించాడని ఆరోపణలు ఉన్నాయి.
ఈ విషయం బయటపడటంతో పోలీసులు దర్శన్, పవిత్ర గౌడ, ఇంకా కొంతమందిని అరెస్టు చేసి.. రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించారు. అయితే ఈ కేసు కు సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టేందుకు పోలీసులు పవిత్ర గౌడను బెంగళూరులోని ఆమె ఇంటికి తీసుకెళ్లారు. పోలీసులు పలు రకాల ఆధారాలను రాబట్టేందుకు ఆమె ఇంటిని పరిశీలించారు. ఈలోగా కొంత గ్యాప్ లభించడంతో.. ఆమె మేకప్ వేసుకుంది.. లిప్ స్టిక్ పూసుకుంది. పైగా ఆమె నవ్వుతూ బయటికి వచ్చింది. దీంతో ఉన్నతాధికారులకు ఒళ్ళు మండింది. ఆమె మేకప్ వేసుకునేందుకు అనుమతించిన మహిళా ఎస్ఐకి కర్ణాటక పోలీసులు నోటీసులు జారీ చేశారు.. కస్టడీలో మేకప్ వేసుకోవడానికి వారు తీవ్రంగా పరిగణించారు.. అయితే ఈ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. దర్శన్ ను తప్పించేందుకు కర్ణాటక అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారని బిజెపి నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రత్యేక దర్యాప్తు బృందం నిష్పక్షపాతంగా విచారణ జరిపించి.. నిందితులకు శిక్ష పడేలా వ్యవహరించాలని డిమాండ్ చేస్తున్నారు.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Serious action by the police for pavitri gowda wearing make up in custody
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com