Homeఅంతర్జాతీయంHawaii: మలేరియా తగ్గించాలని.. దోమలు పెంచుతున్నారు.. హవాయ్‌లో వినూత్న కార్యక్రమం..!

Hawaii: మలేరియా తగ్గించాలని.. దోమలు పెంచుతున్నారు.. హవాయ్‌లో వినూత్న కార్యక్రమం..!

Hawaii: అంతరించిపోతున్న జీవ జాతులను రక్షించేందుకు అనేక దేశాలు సంరక్షణ చర్యలు చేపడుతుంటాయి. ఉత్పత్తి పెంపునకు ఏర్పాటు చేస్తాయి. అలాగే.. అమెరికాలోకి హవాయి రాష్ట్రం కూడా ఓ వినూత్న కార్యక్రమం చేపట్టింది. తమ ప్రాంతంలో అంతరించిపోయే అరుదైన పక్షులను కాపాడుకునేందుకు బ్యాక్టిరియాతో కూడిన లక్షలాది దోమలను విడిచిపెడుతోంది. హెలిక్యాప్టర్లలో తీసుకొచ్చి మరీ వదిలిపోడుతున్నారు.

50 పక్షిజాతులకు ముప్పు..
ప్రకృతి అందానికి పెట్టింది పేరు హవాయి దీవులు వీటిలో 33 రకాల పక్షులు అంతరించిపోతున్నట్లు స్థానిక ప్రభుత్వం గుర్తించింది. మరో 17 రకాల జాతులు ముప్పును ఎదుర్కొంటున్నాయి. వాటిలో కొన్ని ఏడాదిలో కనుమరుగయ్యే అవకాశం ఉంది. ’అకికికి’ అనే పక్షుల సంఖ్య 2018లో 450 ఉన్నట్లు అంచనా వేయగా.. 2023 నాటికి వాటి సంఖ్య ఐదుకు పడిపోయింది. ఇప్పుడు ఒక్కటి మాత్రమే మిగిలి ఉండొచ్చని అంచనా.

పర్యావరణవేత్తల ఆందోళన..
అంతరించిపోతున్న జీవజాతులపై పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందుకోసం భారీస్థాయిలో దోమలను హెలిక్యాప్టర్ల సాయంతో విడుదల చేస్తోంది. వారానికో హెలిక్యాప్టర్‌లో రెండున్నర లక్షల మగ దోమలను తీసుకువస్తున్నారు. ఇప్పటి వరకు కోటి దోమలను వివిధ ప్రదేశాల్లో విడిచిపెట్టారు.

మలేరియా ముప్పు..
హవాయిలో మాత్రమే కనిపించే కొన్ని అరుదైన పక్షిజాతులు(హనీక్రీపర్స్‌) మలేరియా ముప్పును ఎదుర్కొంటున్నాయి. వ్యాధి కారక దోమ కుడితే 90 శాతం చనిపోయే ప్రమాదం ఉంది. మలేరియాను ఎదుర్కొనే రోగ నిరోధక శక్తి వీటికి లేదు. ఈ నేపథ్యంలో వోల్బాకియా అనే బ్యాక్టీరియాతో కూడిన మగ దోమలను ఉత్పత్తి చేస్తున్నారు. వీటిని కలిసిన ఆడ దోమలు గుడ్లు పొదగవు. ఇలా క్రమంగా దోమల సంఖ్యను తగ్గించే ఉద్దేశంతో ఈ సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. దీన్ని ఇన్కంపాటబుల్‌ ఇన్సెక్ట్‌ టెక్నిక్‌గా వ్యవహరిస్తారు. యూఎస్‌ నేషనల్‌ పార్క్‌ సర్వీస్‌ సహాయంతో హవాయి రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టింది. చైనా, మెక్సికోలో దోమల సంఖ్యను తగ్గించేందుకు ఇదే విధానాన్ని అనుసరించినట్లు నివేదికలు తెలిపాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Telangana Employee Health Scheme

Telangana Employee Health Scheme: తెలంగాణ ఉద్యోగులు గుడ్‌ న్యూస్‌.. 40 ఏళ్లు దాటితే ఫ్రీ హెల్త్‌ చెకప్‌!

Telangana Employee Health Scheme: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. వారి సంక్షేమం కోసం ‘నూతన ఉద్యోగ ఆరోగ్య పథకం’ (ఎన్‌ఈహెచ్‌ఎస్‌) మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ పథకం...
Bigg Boss 10 Telugu

Bigg Boss 10 Telugu: ఆ హీరోయిన్స్ కోసం కోట్లు కుమ్మరించేందుకు సిద్దమైన ‘బిగ్ బాస్ 10’ టీం.....

Bigg Boss 10 Telugu: గత బిగ్ బాస్ సీజన్ అందరి అంచనాలను దాటి , కనీవినీ ఎరుగని రేంజ్ లో బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ని సొంతం చేసుకొని , రికార్డు...
Toxic Movie

Toxic Movie: ‘టాక్సిక్’ నుండి మరో హాట్ రొమాంటిక్ సాంగ్ వచ్చేసింది.. ఈసారి డోస్ బాగా తగ్గించేశారుగా!

Toxic Movie: కన్నడ సూపర్ స్టార్ యాష్ నటించిన లేటెస్ట్ చిత్రం 'టాక్సిక్' వచ్చే నెల ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్ల గ్రాండ్ గా విడుదల అవ్వబోతున్న సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన...
Nagarjuna

Nagarjuna: ‘లెనిన్’ ని ఆ రేంజ్ కి తీసుకెళ్లలేకపోయాము అంటూ నాగార్జున హాట్ కామెంట్స్.. వీడియో వైరల్..

Nagarjuna: అక్కినేని ఫ్యామిలీ 'లెనిన్' సక్సెస్ సెలబ్రేషన్స్ లో మునిగి తేలుతున్న సంగతి అందరికీ తెలిసిందే. 12 ఏళ్ళ నిరీక్షణకు తెరదించుతూ , అక్కినేని అఖిల్ ఈ చిత్రం తో భారీ బ్లాక్...
Bigg Boss 10 Telugu

Bigg Boss 10 Telugu: పోలీస్ బిడ్డ.. ఆర్మీ బిడ్డ.. మధ్యలో జపాన్ బిడ్డ.. ‘బిగ్ బాస్...

Bigg Boss 10 Telugu: కోట్లాది మంది ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఆతృతగా ఎదురు చూస్తున్న 'బిగ్ బాస్ 10' సెప్టెంబర్ 6 న గ్రాండ్ గా ప్రారంభం కాబోతుంది. గత ఏడాది...
Oktelugu Epaper