Please dont watch Prabhas Kalki in 3D
Kalki Movie: ప్రభాస్ హీరోగా గతంలో వచ్చిన కల్కి సినిమా పాజిటివ్ టాక్ తో ముందుకు దూసుకెళ్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా సూపర్ సక్సెస్ అవ్వడానికి చాలా కారణాలు ఉన్నాయంటూ చాలామంది చాలా రకాల కామెంట్లైతే చేస్తున్నారు. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో తనని తాను మరొకసారి స్టార్ హీరోగా ప్రూవ్ చేసుకున్నాడు. ఇక ఈ సినిమాతో ప్రభాస్ అమితాబచ్చన్ అందరూ తమదైన రీతిలో నటించి మెప్పించారు.
ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాను 2డి 3డి రెండు వెర్షన్లల్లో రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమాని 3డిలో చూసినవాళ్లు 3డి లో చూసే కంటే ఈ సినిమాను 2డిలో చూస్తేనే విజువల్ ఎఫెక్ట్స్ గాని, యాక్షన్ సీక్వెన్స్ గాని ప్రేక్షకుడు ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక 3డీలో ఈ సినిమాను చూడటం వేస్ట్ అంటూ కొందరు సోషల్ మీడియాలో కామెంట్లైతే చేస్తున్నారు. ఇక ఈ సినిమాను చూసిన వాళ్లు కూడా 3డి కంటే 2డి లో చూడడం బెటర్ అంటూ చెప్పడం విశేషం.. ఇక మొత్తానికైతే ఈ సినిమా భారీ సక్సెస్ అయ్యే దిశగా ముందుకు దూసుకెళ్తుంది.
ఇక ఇప్పటికే ఒక్క రోజులోనే 200 కోట్లకు పైన వసూళ్లను రాబట్టిన ఈ సినిమా లాంగ్ రన్ లో బాహుబలి 2 రికార్డును కూడా బ్రేక్ చేస్తుంది అంటూ వార్తలైతే వస్తున్నాయి… ఇక ఈ సినిమాతో నాగ్ అశ్విన్ ఒక భారీ సక్సెస్ ని సాధించాడనే చెప్పాలి. నిజంగా ఆయనకు ఉన్న టాలెంట్ కి అందరూ హాట్సాఫ్ చెప్పాల్సిందే..
మొన్నటిదాకా రాజమౌళిని ఢీకొట్టే దర్శకుడు మరొకరు లేరు అనే వార్తలైతే వచ్చాయి. కానీ కల్కి సినిమా చూసిన తర్వాత రాజమౌళికి ఏమాత్రం తగ్గకుండా నాగ్ అశ్విన్ కూడా తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకున్నాడని చాలామంది వాళ్ళ అభిప్రాయాలనైతే వ్యక్తం చేస్తున్నారు…ఇక ఈ సినిమాతో ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో తెలుగు సినిమా స్థాయి ఏంటో అందరికీ అర్థమైంది…