Maruti Suzuki Fronx
Maruti Suzuki Fronx: ఈ మధ్య కాలంలో కార్లు కొనాలనుకునేవారు SUVలకు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. విశాలమైన స్పేస్ తో పాటు హైబ్రిడ్ ఇంజిన్ ను కలిగిన ఎస్ యూవీలను కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా ఉత్పత్తి చేస్తుంటాయి. ఈ నేపథ్యంలో మారుతి సుజుకీ కంపెనీ కాంపాక్ట్ ఎస్ యూవీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మోడల్ ఎస్ యూవీ అయినా తక్కువ ధరకు అందిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. అంతేకాకుండా అప్డేట్ ఫీచర్స్ తో పాటు ఆకర్షణీయమైన లుక్ లో ఉండడంతో 6 నెలల్లోనే అత్యధికంగా అమ్ముడుపోయాయి. ఇంతకీ ఈ కారు విశేషాలేంటంటే?
కొత్త కార్లు తీసుకురావడంలో మారుతి సుజుకీ ముందు వరుసలో ఉంటుంది. ఈ కంపెనీ నుంచి హ్యాచ్ బ్యాక్ తో పాటా ఎస్ యూవీలు బయటకు వచ్చి ఆకర్షించాయి. ఆరు నెలల ముందు మారుతి రిలీజ్ చేసిన ఫ్రాంక్స్ కాంపాక్ట్ ఎస్ యూవీ విపరీతంగా ఆదరణ పొందుతోంది. ఫ్రాంక్స్ 2023 ఏప్రిల్ 24న రిలీజ్ అయింది. అప్పటి నుంచి ఆరు నెలల్లో 63, 477 యూనిట్లు అమ్ముడుపోవడం విశేషం. ఒక్క సెప్టెంబర్ లోనే ఈ కారును 11,455 మంది వినియోగదారులు కొనుగోలు చేశారు.
మారుతి సుజుకీ ఫ్రాంక్స్ ఫీచర్ లోకి వెళ్తే.. 1.0 లీటర్ టర్బో పెట్రోల్ మైల్డ్ తో పాటు హైబ్రిడ్ ఇంజిన్ ను కలిగి ఉంది. ఇందులో 100 బీహెచ్ పీ ఇంజిన్ పవర్, 148 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 1.2 డ్యూయల్ జెట్ పెట్రోల్ ఇంజిన్ ను 90 బీహెచ్ పీ పవర్ 113 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 5 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ను అమర్చారు. రెండో ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్, 5 స్పీడ్ ఏఎంటీ గేర్ బాక్స్ ను సెట్ చేశారు.
ఈ కారు ఢిల్లీలో రూ.7.46 లక్షల ఎక్స్ షోరూం ధరతో ప్రారంభం అవుతుంది. ఆన్ రోడ్ కు వచ్చే సరికి రూ.8.37 లక్షలు అవుతుంది. ఈఎంఐ ద్వారా కొనాలనుకుంటే రూ.50 వేలు డౌన్ పేమేంట్ చెల్లించి కొనుగోలు చేయొచ్చు. ఎస్ యూవీలకు ఎక్కువ ఆదరణ పెరుగుతున్న నేటి కాలంలో ఈ ధరలో కాంపాక్ట్ ఎస్ యూవీని దక్కించుకోవాలంటే ఇది బెస్ట్ ఆప్షన్ అని అంటున్నారు. ఆకర్షణీయమైన లుక్ తో ఉండడంతో దీనిపై చాలా మంది మనసు పెడుతున్నారు.