Mallareddy On Mahesh Babu: నీ వల్లే ఎంపీనయ్యా.. మల్లారెడ్డి మాటలకు పగలబడి నవ్విన మహేష్ బాబు.. వైరల్ వీడియో

రాజమౌళి మహేష్ బాబు లాంటి స్టార్లు ఆ ఈవెంట్ కి ప్రధాన ఆకర్షణ గా నిలిచారు.ఇక అందరికంటే మంత్రి మల్లారెడ్డి రావడం ఆయన మాట్లాడం అందరిని ఆకర్షించింది.

  • Written By: Gopi
  • Published On:
Mallareddy On Mahesh Babu: నీ వల్లే ఎంపీనయ్యా.. మల్లారెడ్డి మాటలకు పగలబడి నవ్విన మహేష్ బాబు.. వైరల్ వీడియో

Mallareddy On Mahesh Babu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మనందరికీ తెలిసిందే… ఆ ఒక్క సినిమా తోనే అయిన ఇండస్ట్రీ లో టాప్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఈ సినిమాతో బాలీవుడ్ లో కూడా అడుగు పెట్టి కబీర్ సింగ్ అనే సినిమా చేశారు. ఇక ఇప్పుడు అనిమల్ సినిమాతో మళ్ళీ మరోసారి పాన్ ఇండియా రేంజ్ లో ఇండస్ట్రీ రికార్డ్ లు మొత్తం బ్రేక్ చేయడానికి డిసెంబర్ ఒకటోవ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక ఈ క్రమంలోనే నిన్న మల్లారెడ్డి యూనివర్సిటీలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏర్పాటు చేశారు.

ఇక ఈ క్రమంలోనే చీఫ్ గెస్టులుగా రాజమౌళి మహేష్ బాబు లాంటి స్టార్లు ఆ ఈవెంట్ కి ప్రధాన ఆకర్షణ గా నిలిచారు.ఇక అందరికంటే మంత్రి మల్లారెడ్డి రావడం ఆయన మాట్లాడం అందరిని ఆకర్షించింది. స్టేజ్ పైకి ఎక్కి అనిమల్ సినిమాకి బెస్ట్ విషెస్ చెప్తూనే మహేష్ బాబు గురించి మహేష్ బాబు తీసిన బిజినెస్ మాన్ సినిమా గురించి మాట్లాడుతూ నేను బిజినెస్ మాన్ సినిమా చూసే పాలిటిక్స్ లోకి వచ్చాను. బిజినెస్ మాన్ సినిమా చూసే నేను మంత్రిగా మారాను అంటూ చెబుతుండగా మహేష్ బాబు మాత్రం మల్లారెడ్డి మాటలకి నవ్వుకున్నాడు.

ఇక ఈ విధంగా సందీప్ రెడ్డి వంగ లాంటి డైరెక్టర్లు ఇండియాలోనే కాదు హాలీవుడ్ లో కూడా సినిమాలు తీసి నెంబర్ వన్ డైరెక్టర్ గా ఎదుగుతాడు అంటూ అలాగే రాజమౌళి లాంటి డైరెక్టర్ ఇప్పటికే హాలీవుడ్ రేంజ్ లో సినిమాలు చేస్తున్నాడు. వీళ్లంతా టాప్ డైరెక్టర్లు తెలుగు సినిమా ఇండస్ట్రీ ని హాలీవుడ్ రేంజ్ లోకి తీసుకెళ్లగలగే సత్తా ఉన్న డైరెక్టర్లు అంటూ తను ఇచ్చిన స్పీచ్ కి అక్కడున్న వాళ్ళు అందరూ పగలబడి నవ్వకున్నారు.ఇక ఇప్పటికే మల్లారెడ్డి ఎలక్షన్స్ లో బిజీగా ఉన్నా కూడా అనిమల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రావడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.

పొలిటిషన్ గా మల్లారెడ్డి విషయం పక్కన పెడితే ఆయన స్పీచ్ ఇచ్చినప్పుడు మాత్రం ప్రతి ఒక్కరూ విపరీతంగా నవ్వుతూ ఎంజాయ్ చేశారు…ఇక ఈ ఫంక్షన్ ప్రతి ఒక్కరూ తమదైన బెస్ట్ విషెస్ ని చెబుతూ సినిమా ఇండస్ట్రీలోనే సూపర్ డూపర్ హిట్ అవుతుంది అంటూ మాట్లాడారు…

Read Today's Latest Pratyekam News, Telugu News LIVE Updates on Oktelugu
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు