Animal: రణ్ బీర్ కపూర్, మహేష్, రాజమౌళి.. ఈ సీన్ చూడాల్సిందే

సినిమా మీద ఇప్పటి నుంచే అంచనాలు పెరగడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతే కాదు డైరెక్టర్ పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. సందీప్ రెడ్డి మరో బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వడం పక్కా అంటున్నారు.

  • Written By: Neelambaram
  • Published On:
Animal: రణ్ బీర్ కపూర్, మహేష్, రాజమౌళి.. ఈ సీన్ చూడాల్సిందే

Follow us on

Animal: అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ వంటి సినిమాల తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ మూవీ యానిమల్. ఈ సినిమా డిసెంబర్ 1 భారీగా విడుదలకానుంది. దీంతో ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే పలు ప్రచార చిత్రాలు విడుదలై మంచి రెస్పాన్స్ ను దక్కించుకున్నాయి. ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన ట్రైలర్ కు మాత్రం రెస్పాన్స్ ఓ రేంజ్ లో వస్తోంది. ట్రైలర్ చూసిన నెటిజన్లు ఏం తీశావయ్య సందీప్ అంటూ ఓ రేంజ్ లో ప్రశంసలు కురిపిస్తున్నారు. అసలు ఆ విజువల్స్, టేకింగ్, మ్యూజిక్ సూపర్ గా ఉందని కొనియాడుతున్నారు.

సినిమా మీద ఇప్పటి నుంచే అంచనాలు పెరగడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతే కాదు డైరెక్టర్ పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. సందీప్ రెడ్డి మరో బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వడం పక్కా అంటున్నారు. ఇదిలా ఉంటే సినిమా విడుదల తేది దగ్గర వస్తుండడంతో టీమ్ ప్రమోషన్స్ లో భాగంగా.. ప్రీరిలీజ్ ఈవెంట్ ను ఈ రోజు హైదరాబాద్ లో ఘనంగా నిర్వహిస్తోంది. ఈ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా లుగా రాజమౌళి, మహేష్ బాబు వస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే ఈ ఈవెంట్ ఎక్కడో కాదు హైదరాబాద్ లోని మల్లారెడ్డి యూనివర్సిటీలో జరగనుంది.

ఇక ట్రైలర్ ను బట్టి చూస్తే చిన్నతనంలో అబ్యూస్ కు గురైన ఓ కొడుకు తాను ఏంటో నిరూపించుకోవడానికి ఎలా మారాడు? ఆ తర్వాత ఏం జరిగిందనేది స్టోరీలా తెలుస్తోంది. అయితే తండ్రి కొడుకుల మధ్య బలమైన బంధాలతో ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. మంచి ఎమోషన్ తో పాటు యాక్షన్ కూడా ఓ రేంజ్ లో ఉండబోతుందని ట్రైలర్ చూస్తుంటే అర్థం అవుతుంది. మరి సినిమా రిలీజ్ తర్వాత ఎలా ఉంటుందో చూడాలి. ఇక త్వరలోనే మహేష్, రాజమౌళి కాంబినేషన్ లో ఓ సినిమా రానున్న విషయం తెలిసిందే.

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu

సంబంధిత వార్తలు