Madhuri Dixit: బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ మాధురి దీక్షిత్ తనయుడు ర్యాన్ తన గొప్పమనసు చాటుకున్నారు. నేషనర్ కేన్సర్ అవేర్నెస్ డే సందర్భంగా కేన్సర్ బాధితుల కోస తన జుట్టును దానం చేశారు. దీంతో నెటిజన్లు ఆ చిన్నారిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను మాధురి దీక్షిత్ స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నారు. ఒకప్పటి అందాల తారగా, డాన్సింగ్ క్వీన్‌గా మాధురి దీక్షిత్ ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. కాగా, మాధురి, శ్రీరామ్ నెనె దంపతుల చిన్న కుమారుడే ర్యాన్. కేన్సర్ బారిన పడి కీమో థెరపీ చేయించుకున్న వారిని చూసి చలించి పోయిన ర్యాన్.. జట్టును కోల్పోయిన వారిలో ఆత్మవిశ్వాసం నింపాలనుకున్నారు.
ఈ క్రమంలోనే రెండేళ్ల పాటు జుట్టును పెంచి కీమో థెరఫీ చేయించుకున్న పేషెంట్ల కోసం డొనేట్ చేశారు. మొదట ఈ విషయం తెలియగానే తాము ఆశ్చర్యానికి గురైనట్లు మాధురి తెలిపారు. దాదాపు రెండు సంవత్సరాల పాటు పెంచుకున్న జుట్టును డొనేట్ చేయడంపై తన కుమారుడిని చూసి చాలా గర్వపడుతున్నామని మాధురి పేర్కొన్నారు. ర్యాన్ తీసుకున్న నిర్ణయంపై మాధురి అభిమానులతో పాటు, పలువురు సెలెబ్రిటీలు, నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. చిన్న వయసులోనే కొడుకుని అంతా గొప్పగా ఆలోచించేల చేస్తున్న మాధురి దీక్షిత్ ను ను అభినందిస్తూ ఆమె అభినలు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు పెడుతున్నారు.