Acharya: ఆచార్యలో చరణ్ పాత్ర నిడివిపై మరింత క్లారిటీ
Acharya: మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోగా రాజమౌళి తెరకెక్కిస్తోన్న సినిమా ఆర్ఆర్ఆర్.. దీంతో పాటు కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ హీరోగా వస్తోన్న ఆచార్య లోనూ నటించారు చెర్రి. ఈ సినిమాలో సిద్ధా పాత్రలో అలరించేందుకు సిద్ధమయ్యారు. కాగా, ఈ సినిమా మొదలైనప్పటి నుంచి చెర్రి పాత్రపై రకరకాల ఊహాగానాలు వినిపించాయి. Also Read: ఏపీలో వరద బాధితుల అండగా మెగా హీరోలు… విరాళాలు ప్రకటించిన మెగాస్టార్ చిరంజీవి, చరణ్ మొదట్లో ఆచార్య సినిమాలో చరణ్ పాత్ర […]

Acharya: మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోగా రాజమౌళి తెరకెక్కిస్తోన్న సినిమా ఆర్ఆర్ఆర్.. దీంతో పాటు కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ హీరోగా వస్తోన్న ఆచార్య లోనూ నటించారు చెర్రి. ఈ సినిమాలో సిద్ధా పాత్రలో అలరించేందుకు సిద్ధమయ్యారు. కాగా, ఈ సినిమా మొదలైనప్పటి నుంచి చెర్రి పాత్రపై రకరకాల ఊహాగానాలు వినిపించాయి.

ram charan teaser released from megastar chiranjeevi acharya movie
Also Read: ఏపీలో వరద బాధితుల అండగా మెగా హీరోలు… విరాళాలు ప్రకటించిన మెగాస్టార్ చిరంజీవి, చరణ్
మొదట్లో ఆచార్య సినిమాలో చరణ్ పాత్ర చాలా చిన్నదని.. అందుకు వేరే స్టార్స్‌ను పెడితే బాగుటుందని మేకర్స్ ఆలోచించినట్లు వార్తలు వినిపించాయి. కొన్ని రోజులపాటు ఆదే సస్పెన్స్ కొనసాగింది. చివరకు చరణ్‌నే ఈ సినిమాలో కన్ఫర్మ్ చేశారు. కాగా, కథానుసారం చరణ్ పాత్ర చాలా కీలకంగా ఉండనుందని గతంలో ఓ ఇంటర్వ్యూలో కొరటాల చెప్పారు. ఈ క్రమంలోనే చెర్రీ పాత్రపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఈ క్రమంలోనే చరణ్ ఆచార్య సినిమాలో ఎంతసేపు కనిపిస్తాడన్న అంశంపై ప్రస్తుతం చర్చ నడుస్తోంది. అయితే, తాజాగా ఈ విషయంపై ఓ క్లారిటీ వచ్చినట్లు కనిపిస్తోంది. సినిమాలో చరణ్ పాత్ర సెకండ్ ఆఫ్‌లో మొదలై.. దాదాపు 40 నిమిషాల నిడివితో ఉండనుందని తెలుస్తోంది. ఈ 40 నిమిషాలు కూడా సినిమాకు అత్యంత కీలకంగా మారనుందని సమాచారం.
తండ్రి, కొడుకులు కలిసి ఒకే స్క్రీన్‌పై ఎక్కువసేపు కనిపించనున్న తొలి సినిమా ఇదే కావడం విశేషం. ఇందులో కాజల్, పూజా హెగ్డేలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. దానికి తోడు ఆర్ఆర్ఆర్లో కూడా చరణ్ విభిన్న పాత్రల్లో కనిపించనున్నారట. ఈ విషయాన్ని చరణ్ ఓ మీడియాతో మాట్లాడుతూ బయటకు చెప్పేశారు. కాగా ఆర్ఆర్ఆర్లో చెర్రీతో పాటు తారక్ కూడా నటిస్తున్నాడు.
Also Read: శంకర్- చరణ్ సినిమా రిలీజ్ డేట్‌పై ఇంట్రస్టింగ్ అప్డేట్.. రివీల్ చేసిన చెర్రి
