Telangana Election Results 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బ్రదర్స్‌కు బంపర్‌ మెజారిటీ..

కాంగ్రెస్‌ నుంచి పోలీ చేసిన అన్నదమ్ములు గడ్డం వినోద్, గడ్డం వివేక్‌ ఘన విజయం సాధించారు. ఇద్దరూ మంచిర్యాల జిల్లాలోని ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాలు బెల్లంపల్లి, చెన్నూర్‌ నుంచి పోటీ చేశారు.

  • Written By: Raj Shekar
  • Published On:
Telangana Election Results 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బ్రదర్స్‌కు బంపర్‌ మెజారిటీ..

Follow us on

Telangana Election Results 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ చివరి దశకు చేరుకుంది. కాంగ్రెస్‌ విజయం ఖాయమైంది. ప్రస్తుత ట్రెండ్స్‌ ప్రకారం.. మ్యాజిక్‌ ఫిగర్‌ కన్నా ఏడు స్థానాలు ఎక్కువగానే కాంగ్రెస్‌ గెలవబోతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా సంబురాలు చేసుకుంటున్నాయి. ఇక ఈ ఎన్నికల్లో మరో సంచలనం నమోదైంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన పోటీ చేసిన భార్య భర్తలు, అన్నదమ్ములు ఘన విజయం సాధించారు.

గడ్డం బ్రదర్స్‌ విజయం..
కాంగ్రెస్‌ నుంచి పోలీ చేసిన అన్నదమ్ములు గడ్డం వినోద్, గడ్డం వివేక్‌ ఘన విజయం సాధించారు. ఇద్దరూ మంచిర్యాల జిల్లాలోని ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాలు బెల్లంపల్లి, చెన్నూర్‌ నుంచి పోటీ చేశారు. ఇక్కడ ఇద్దరూ ఘన విజయం సాధించారు. పెద్దపల్లి లోక్‌సభ ఎన్నికల్లో తనను ఓడించిన బాల్క సుమన్‌పై వివేక్‌ చెన్నూర్‌లో గెలిచి సత్తా చాటారు. 35 వేల ఓట్ల మెజారిటీతో గెలిచి ప్రతీకారం తీసుర్చకున్నారు. ఇక గత ఎన్నికల్లో గడ్డం వినోద్‌ ఓటమిలో కూడా గత ఎన్నికల్లో బాల్క సుమన్‌ కీలకంగా వ్యవహరించారు. 2018లో బెల్లంపల్లిలో ఓడిపోయిన వినోద్‌.. ఇప్పుడు అక్కడి నుంచే 19 వేల ఓట్ల మేజారిటీతో గెలిచారు.

కోమటిరెడ్డి బ్రదర్స్‌..
ఇక ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన కోమటి రెడ్డి బ్రదర్స్‌ కూడా ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. భువనగిరి నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి 35 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో గెలవగా, మునుగోడు నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి 27 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇద్దరూ కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు.

దంపతుల సూపర్‌ విక్టరీ..
కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన దంపతులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఉత్తమ్‌ పద్మావతి కూడా విజయం సాధించారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హుజూర్‌నగర్‌ నుంచి భారీ ఆధిక్యంతో విజయం సాధించారు. ఆయన భార్య ఉత్తమ్‌ పద్మావతి కూడా కోదాడలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థిపై విజయం ఆధిక్యం ప్రదర్శిస్తున్నారు.

Read Today's Latest Telangana politics News, Telugu News LIVE Updates on Oktelugu

సంబంధిత వార్తలు