హీరో హత్య కేసును క్లోజ్ చేయడానికే ఈ అరెస్ట్ ?

బాలీవుడ్ హీరో సుషాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మ‌హ‌త్య సంఘటన దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించినా.. ఈ కేసు పై ఇంకా స్పష్టత లేకపోవడం మన దేశ న్యాయ వ్యవస్థకే అవమానం. అసలు ఈ కేసునే పూర్తిగా మరచిపోయాక.. ఇప్పుడు తీరిగ్గా పోలీసులు ‘సుషాంత్ సింగ్ రాజ్ పుత్’ పి.ఆర్ మేనేజ‌ర్ సిద్ధార్థ్‌ ను ఎన్‌సీబీ అధికారులు హైద‌రాబాద్‌లో అరెస్ట్ చేశారు. సిద్ధార్థ్‌ ను అరెస్ట్ చేశారు ? బాగుంది, అసలు దేనికి అరెస్ట్ చేశారు ? […]

  • Written By: Raghava
  • Published On:
హీరో హత్య కేసును క్లోజ్ చేయడానికే ఈ అరెస్ట్ ?

Follow us on

బాలీవుడ్ హీరో సుషాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మ‌హ‌త్య సంఘటన దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించినా.. ఈ కేసు పై ఇంకా స్పష్టత లేకపోవడం మన దేశ న్యాయ వ్యవస్థకే అవమానం. అసలు ఈ కేసునే పూర్తిగా మరచిపోయాక.. ఇప్పుడు తీరిగ్గా పోలీసులు ‘సుషాంత్ సింగ్ రాజ్ పుత్’ పి.ఆర్ మేనేజ‌ర్ సిద్ధార్థ్‌ ను ఎన్‌సీబీ అధికారులు హైద‌రాబాద్‌లో అరెస్ట్ చేశారు.

సిద్ధార్థ్‌ ను అరెస్ట్ చేశారు ? బాగుంది, అసలు దేనికి అరెస్ట్ చేశారు ? ఇంతకీ సుషాంత్ సింగ్ రాజ్ పుత్ ది హ్యత్యా ? ఆత్మహత్యా ? అనే దాని పై ఇంకా క్లారిటీ లేదు. ఒక హీరో.. పైగా స్టార్ డమ్ తెచ్చుకుని ఎంతో భవిష్యత్తు ఉన్న హీరో.. ఇలా అర్ధంతరంగా శవం అయి కనిపిస్తే.. ఆ శవం వెనుక ఉన్న కథనాన్ని బయట పెట్టడానికి సంవత్సరాలు పడుతుంది ?

సినీ ప్రేముకులతో సాధారణ ప్రేక్షకుల మనసులను తీవ్రంగా కలిచివేసిన ఈ విషాదర సంఘటన పై ఇప్పటికీ సుశాంత్ అభిమానులతో పాటు యావత్తు సినీ జనాలు కూడా అసలు ఏం జరిగిందని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, విచారణ జరిపే కొద్దీ కేసు మ‌రింత జ‌ఠిల‌మైవుతూ వచ్చింది ఈ కేసు. సీబీఐ వేగంగా ద‌ర్యాప్తు చేస్తోన్నా.. నిజానిజాలు ఏమిటనేది ఇంకా స్పష్టత రాకపోవడం,

తాజాగా సుషాంత్ మేనేజర్ ను అరెస్ట్ చేయడం చూస్తుంటే.. ఈ కేసును క్లోజ్ చేయడానికి అతని పీఏని బలి చేస్తున్నారా ? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. అన్నిటికి మించి సుషాంత్ మ‌ర‌ణం పై బీజేపీ ఎంపీ సుబ్ర‌హ్మ‌ణ్య స్వామి సుషాంత్ పై విష ప్ర‌యోగం జ‌రిగింద‌ని ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణ నిజమా ? అబద్దమా ? అనేది పోలీసులు మరో పది సంవత్సరాలు అయినా తేల్చ లేరేమో.

Read Today's Latest Bollywood News, Telugu News LIVE Updates on Oktelugu

సంబంధిత వార్తలు