Indian2 : భారతీయుడు 2 అప్డేట్… రామ్ చరణ్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ!

షూటింగ్ అసిస్టెంట్స్ తో లాగించేస్తున్నాడని సమాచారం. భారతీయుడు 2 పూర్తి అయ్యే వరకు గేమ్ ఛేంజర్ కి కష్టాలు తప్పవు.

  • Written By: NARESH
  • Published On:
Indian2 : భారతీయుడు 2 అప్డేట్… రామ్ చరణ్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ!

Follow us on

Indian2 : వెంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందని ఓ సామెత ఉంది. అది భారతీయుడు 2- గేమ్ ఛేంజర్ చిత్రాలకు చక్కగా సెట్ అవుతుంది. వాయువేగంతో దూసుకెళుతున్న గేమ్ ఛేంజర్ షూటింగ్ కి భారతీయుడు 2 రూపంలో అడ్డుకట్ట పడింది. విక్రమ్ మూవీతో కమల్ హాసన్ ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. ఆ మూవీ ఏకంగా రూ. 400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. దాంతో భారతీయుడు 2 నిర్మాతల్లో చలనం వచ్చింది. దర్శకుడు శంకర్ గతంలో మొదలుపెట్టిన భారతీయుడు 2 షూటింగ్ వివాదాలతో ఆగిపోయింది.

నిర్మాతలతో దర్శకుడు శంకర్ కి చెడింది. దానికి తోడు సెట్స్ లో ప్రమాదం జరిగి ఒకరు మరణించారు. ఈ పరిణామాల నేపథ్యంలో షూటింగ్ ఆపేశారు. దాంతో రామ్ చరణ్ తో శంకర్ గేమ్ ఛేంజర్ స్టార్ట్ చేశాడు. షూటింగ్ నిరవధికంగా సాగుతుండగా భారతీయుడు 2 నిర్మాతలు కాంప్రమైజ్ అయ్యారు. శంకర్ ని బుజ్జగించి సినిమా పూర్తి చేసేందుకు ఒప్పించారు. భారతీయుడు 2 తిరిగి ప్రారంభం అయ్యాక శంకర్ దృష్టి గేమ్ ఛేంజర్ మీద లేదు.

షూటింగ్ అసిస్టెంట్స్ తో లాగించేస్తున్నాడని సమాచారం. భారతీయుడు 2 పూర్తి అయ్యే వరకు గేమ్ ఛేంజర్ కి కష్టాలు తప్పవు. ఈ చిత్ర విడుదల తేదీ ఏకంగా 2015కి షిఫ్ట్ అయ్యిందనే వాదన కూడా వినిపిస్తుంది. కాగా శంకర్ తాజాగా భారతీయుడు 2 అప్డేట్ ఇచ్చాడు. నవంబర్ 3న ఫస్ట్ గ్లిమ్ప్స్ విడుదల చేస్తున్నారట. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. ఈ క్రమంలో భారతీయుడు 2 పూర్తి కావస్తుందని రామ్ చరణ్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.

భారతీయుడు 2 వచ్చే ఏడాది సమ్మర్ బరిలో దిగనుందని ఒక అంచనా. శంకర్ అంతకంతకూ చిత్ర షూటింగ్ పొడిగిస్తూ పోతుండగా 2024 సమ్మర్ కైనా వస్తుందా అనే సందేహాలు ఉన్నాయి. భారతీయుడు 2 నుండి అప్డేట్స్ వస్తున్న నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుందని చరణ్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. భారతీయుడు 2 నుండి శంకర్ బయటకు వస్తే… టోటల్ ఫోకస్ గేమ్ ఛేంజర్ మీద పెడతారు. దసరా కానుకగా గేమ్ ఛేంజర్ ఫస్ట్ సింగిల్ వస్తుందని విశ్వసనీయ వర్గాల నుండి చెప్పించారు. తీరా అది కూడా రాలేదు.

ఓ వైపు చరణ్ ఫ్యాన్స్ అప్డేట్ లేదు, షూటింగ్ జరగడం లేదని శంకర్, దిల్ రాజులపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఆ మధ్య ఓ అభిమాని ఏకంగా సూసైడ్ నోట్ రాశాడు. ఈ క్రమంలో భారతీయుడు 2 అప్డేట్ చరణ్ ఫ్యాన్స్ లో ఆనందం నింపిందని అనడంలో సందేహం లేదు.

Read Today's Latest Entertainment News, Telugu News LIVE Updates on Oktelugu

సంబంధిత వార్తలు