HomeNewsStar Heroes: క్రేజ్ పరంగా చూసుకుంటే ఇండియాలో ఉన్న టాప్ 5 స్టార్ హీరోలు వీరే...

Star Heroes: క్రేజ్ పరంగా చూసుకుంటే ఇండియాలో ఉన్న టాప్ 5 స్టార్ హీరోలు వీరే…

బాలీవుడ్ బాద్షాగా పేరుపొందిన షారుక్ ఖాన్ అప్పట్లో వరుస సక్సెస్ లను అందుకున్నాడు. కానీ ఇప్పుడు మాత్రం క్రేజ్ పరంగా కొంతవరకు వెనుకబడ్డాడనే చెప్పాలి. పఠాన్, జవాన్ సినిమాలతో వెయ్యి కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టినప్పటికీ ప్రభాస్ తో పోల్చుకుంటే షారుక్ ఖాన్ క్రేజ్ అనేది కొంత వరకు తగ్గింది...

Star Heroes: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ అంతా ఒకటే అయిపోయింది. పాన్ ఇండియా సినిమాలు రావడం వల్ల నార్త్ సౌత్ అనే తేడా లేకుండా సినిమా ఇండస్ట్రీ మొత్తం ఒకటిగా మారిపోయింది. అందువల్లే ఏ భాష నుంచి సినిమా వచ్చిన కూడా అది పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతూ భారీ సక్సెస్ లను నమోదు చేస్తూ వస్తున్నాయి. ఇక ఇప్పుడు సౌత్ నుంచి వచ్చే హీరోలే బాలీవుడ్ లో ఎక్కువ మ్యాజిక్ చేస్తూ భారీ సక్సెస్ లను అందుకుంటున్నారు. ఇక ముఖ్యంగా తెలుగు హీరోలైతే వరుసగా సక్సెస్ లను కొట్టడమే కాకుండా ఇండస్ట్రీలో తమను మించిన స్టార్ హీరో మరొకరు లేరు అనేంతలా గుర్తింపును సంపాదించుకుంటున్నారు…ఇక
ఇదిలా ఉంటే క్రేజ్ పరంగా ఇండియాలో టాప్ 5 స్టార్ హీరోలు ఎవరో ఒకసారి మనం తెలుసుకుందాం…

ప్రభాస్
ఇక ఈ లిస్టులో మొదటగా మనం ప్రభాస్ గురించి చెప్పుకోవాలి. ప్రభాస్ బాహుబలి సినిమాతో ఒక పెను ప్రభంజనాన్ని సృష్టించాడు. బాహుబలి 2 సినిమాతో తను మరొకసారి స్టార్ హీరోగా ఎదగడమే కాకుండా ఇండియన్ ఇండస్ట్రీలోనే తనను మించిన నటుడు మరొకరు లేరు అనేంతలా గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక రీసెంట్ గా కల్కి సినిమాతో మరొకసారి పాన్ ఇండియా స్టార్ గా తనని తాను ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. ఇక ఈ సినిమా కూడా 1000 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టడంతో ప్రభాస్ ఇప్పటికి నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్నాడు…

షారుఖ్ ఖాన్

బాలీవుడ్ బాద్షాగా పేరుపొందిన షారుక్ ఖాన్ అప్పట్లో వరుస సక్సెస్ లను అందుకున్నాడు. కానీ ఇప్పుడు మాత్రం క్రేజ్ పరంగా కొంతవరకు వెనుకబడ్డాడనే చెప్పాలి. పఠాన్, జవాన్ సినిమాలతో వెయ్యి కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టినప్పటికీ ప్రభాస్ తో పోల్చుకుంటే షారుక్ ఖాన్ క్రేజ్ అనేది కొంత వరకు తగ్గింది…

రామ్ చరణ్

త్రిబుల్ ఆర్ సినిమాతో తన నట విశ్వరూపాన్ని బాలీవుడ్ జనాలకు పరిచయం చేశాడు. ఇక ముఖ్యంగా ఆయన పోషించిన అల్లూరి సీతారామరాజు ప్రేక్షకులను విశేషంగా అలరించింది. అప్పటినుంచి రామ్ చరణ్ నుంచి మరొక సినిమా ఎప్పుడు వస్తుందా అంటూ వాళ్లు విపరీతంగా తాపత్రయ పడుతున్నారు. ఇక ఈయన సినిమా చూడడానికి బాలీవుడ్ లో ఉన్న ప్రతి ప్రేక్షకుడు కూడా చాలా ఈగర్ గా ఎదురుచూస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో వీళ్ళ హవా గురించే బాలీవుడ్ జనాలు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు…

రన్బీర్ కపూర్

సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం లో వచ్చిన అనిమల్ సినిమాతో సూపర్ సక్సెస్ ని అందుకున్న హీరో రన్బీర్ కపూర్…ప్రస్తుతం ఇండియాలో ఉన్న ఆయన చేసిన ప్రతి సినిమాలో కూడా ఏదో ఒక వైవిధ్యాన్ని ప్రదర్శిస్తారనే చెప్పాలి. అనిమల్ సినిమాలో మాత్రం చాలా వైల్డ్ గా కనిపించడమే కాకుండా చాలా బోల్డ్ సీన్లలో కూడా నటించి మెప్పించాడు. ఇక ఈ సినిమా వల్ల ఇండియా వైడ్ గా భారీ క్రేజ్ అయితే దక్కింది…

అల్లు అర్జున్

పుష్ప సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్న అల్లు అర్జున్ బాలీవుడ్ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. పుష్ప 2 సినిమాతో మరొకసారి పెను ప్రభంజనాన్ని సృష్టించాలనే ప్రయత్నంలో తను ఉన్నట్టుగా తెలుస్తుంది…

ఇక మొత్తానికైతే ఇప్పటి వరకు భారీ క్రేజ్ ను సంపాదించుకున్న టాప్ 5 హీరోలు వీళ్లే కావడం విశేషం…

Swathi Chilukuri
Swathi Chilukurihttp://oktelugu
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

Oktelugu Epaper