Homeజాతీయ వార్తలుHuzurabad Bypoll: హుజురాబాద్ ఉప ఎన్నిక వాయిదా వల్ల ఎవరికి లాభం?

Huzurabad Bypoll: హుజురాబాద్ ఉప ఎన్నిక వాయిదా వల్ల ఎవరికి లాభం?

Huzurabad BypollHuzurabad Bypoll: హుజురాబాద్ ఉప ఎన్నికపై (Huzurabad Bypoll) పార్టీలు దృష్టి సారిస్తున్నాయి. ఎలాగైనా విజయం సాధించాలని బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు పోటీ పడుతున్నా పోటీ మాత్రం బీజేపీ, టీఆర్ఎస్ మధ్యే ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ ఎన్నికపై కాంగ్రెస్ పార్టీ అంత దృష్టి సారించడం లేదని తెలుస్తోంది. ఇందులో భాగంగానే అభ్యర్థి ప్రకటనపై తాత్సారం చేస్తోందని ప్రచారం సాగుతోంది. కానీ వచ్చే సాధారణ ఎన్నికలే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఈ ఉప ఎన్నికలో గెలిచినా ఓడినా ఎవరికి లాభం అని ప్రశ్నిస్తోంది. దీంతోనే పోటీకి అంతగా ప్రభావం చూపలేకపోతోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహిస్తే బీజేపీకే ప్లస్ అయ్యే అవకాశాలు మెండుగా ఉండడంతో ఇప్పుడే ఎన్నిక నిర్వహించాలని చూస్తున్నా నోటిఫికేషన్ ఆలస్యమవడంతో అందరిలో అనుమానాలు వస్తున్నాయి. అధికార పార్టీ టీఆర్ఎస్ దళితబంధు పేరుతో దళితుల ఓట్లు కొల్లగొట్టాలని భావిస్తోంది. సానుభూతి తనకే ఉందని ఈటల తన గెలుపు ఖాయమని చెబుతున్నారు. దీంతో ఈ ఉప ఎన్నికతో తమ బలాబలాలు ఏమిటో చూపించుకోవాలని చూస్తున్నాయి. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి ఎన్నికల బరిలో నిలుస్తున్నాయి.

నియోజకవర్గ వ్యాప్తంగా ఈటల రాజేందర్ ప్రజా దీవెన యాత్ర పేరుతో పర్యటన చేసి తనను గెలిపించాలని ఓట్లు అభ్యర్థించారు. తన గెలుపును ఏ పార్టీ కూడా అడ్డుకోలేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో హుజురాబాద్ ఉప ఎన్నికపై అందరి దృష్టి పడుతోంది. రాజేందర్ కు మంచి ఆదరణ లభిస్తున్నా ప్రచారంలో కూడా ఎవరు తగ్గకుండా చూసుకున్నారు. ఇప్పటికే వందల కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.

హుజురాబాద్ ఉపఎన్నిక నోటిఫికేషన్ ఇప్పుడు వస్తే బీజేపీకి లాభం కలుగుతుందని ఇంటలిజెన్స్ రిపోర్టు వచ్చింది. దీంతో కేంద్ర ప్రభుత్వం కూడా త్వరగా నిర్వహించాలని చూస్తున్నా నోటిఫికేషన్ ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీఎం కేసీఆర్ కూడా ఉప ఎన్నిక రిపోర్టులు తెప్పించుకున్నట్లు తెలుస్తోంది. అందులో టీఆర్ఎస్ పార్టీ విజయం అసాధ్యమనే విషయాలు వచ్చినట్లు సమాచారం. దీంతో కరోనా సాకుగా చూపి ఎన్నికలు వాయిదా వేయాలని చూస్తున్నట్లు అనుమానాలు వస్తున్నాయి.

ఏది ఏమైనా హుజురాబాద్ ఉప ఎన్నిక వాయిదాపై బీజేపీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. హుజురాబాద్ లో ప్రజల సానుభూతి కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్న ఈటల రాజేందర్ ప్రజలను ప్రసన్నం చేసుకునే పనిలో పడిపోయారు. అధికార పార్టీ కూడా అంతే స్థాయిలో సమాధానం చెప్పాలని భావిస్తోంది. ఇందుకోసం ఇరు పార్టీలు తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...
Akhil Lenin Movie Release Date

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...
Team India Bowling

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....
TTD Trust Board Meeting

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper