Homeఆంధ్రప్రదేశ్‌Vijayasai Reddy: విజయసాయిరెడ్డి కొత్త పార్టీ.. పవర్ ఫుల్ పేరు.. ప్రకటన అప్పుడే?!

Vijayasai Reddy: విజయసాయిరెడ్డి కొత్త పార్టీ.. పవర్ ఫుల్ పేరు.. ప్రకటన అప్పుడే?!

Vijayasai Reddy: విజయసాయిరెడ్డి పార్టీ పెట్టబోతున్నారా? కసరత్తు చేస్తున్నారా? ఆగస్టు 15న కొత్త పార్టీ ప్రకటన ఉంటుందా? ఇప్పటికే పార్టీ పేరును ఖరారు చేశారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. ఒకవైపు సోషల్ మీడియాతో పాటు డిజిటల్ మీడియా ఏర్పాటు పూర్తయింది. ఇంకోవైపు కొత్త పార్టీ ఏర్పాటుపై కూడా ముమ్మర కసరత్తు జరుగుతుంది. అన్ని రంగాల నిపుణులను ఆశ్రయించి వారి అభిప్రాయాలను కూడా తీసుకున్నారు. విలువైన సలహాలను కూడా తీసుకున్నారు. […]

Vijayasai Reddy: విజయసాయిరెడ్డి పార్టీ పెట్టబోతున్నారా? కసరత్తు చేస్తున్నారా? ఆగస్టు 15న కొత్త పార్టీ ప్రకటన ఉంటుందా? ఇప్పటికే పార్టీ పేరును ఖరారు చేశారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. ఒకవైపు సోషల్ మీడియాతో పాటు డిజిటల్ మీడియా ఏర్పాటు పూర్తయింది. ఇంకోవైపు కొత్త పార్టీ ఏర్పాటుపై కూడా ముమ్మర కసరత్తు జరుగుతుంది. అన్ని రంగాల నిపుణులను ఆశ్రయించి వారి అభిప్రాయాలను కూడా తీసుకున్నారు. విలువైన సలహాలను కూడా తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఒక ప్రత్యేక అజెండాతో పార్టీని ప్రకటిస్తున్నారట విజయసాయిరెడ్డి. గత ప్రభుత్వంతో పాటు ప్రస్తుత ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. కొన్ని వర్గాలను ఆకట్టుకునే విధంగా ఈ కొత్త పార్టీ ఉండబోతోంది అనేది ఇప్పుడు చర్చగా మారింది.

* వైసీపీలోకి వెళ్తారని..
గత కొన్ని రోజులుగా విజయసాయిరెడ్డి మళ్ళీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోతారని తెగ ప్రచారం నడిచింది. ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో సరైన వ్యూహకర్తలు లేరు. గతంలో జగన్మోహన్ రెడ్డి వెంట ఉంటూ ఆ పార్టీ ఏర్పాటుతోపాటు అధికారంలోకి వచ్చేందుకు దోహదపడ్డారు విజయసాయిరెడ్డి. కానీ మొన్నటి ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు రావడంతో ఆ పార్టీతో విభేదించి బయటకు వచ్చేసారు. బిజెపిలో చేరుతారన్న ప్రచారం నడిచింది. కానీ కూటమి నుంచి వచ్చిన అభ్యంతరాలు తో అక్కడ వీలుపడలేదు. అందుకే ఆయన తిరిగి వైసీపీలోకి ఎంట్రీ ఇస్తారన్న ప్రచారం జోరుగా సాగింది. కానీ వైసీపీలోకి వెళ్లే కంటే కొత్త పార్టీ ఏర్పాటు వైపే ఆయన మొగ్గు చూపినట్లు స్పష్టమవుతోంది.

* ఆ ముద్ర పడకూడదని..
గతంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో పని చేశారు విజయసాయిరెడ్డి. ఆ పార్టీ ప్రభావం ఆయన పై తప్పకుండా ఉంటుంది. ముఖ్యంగా హిందుత్వ వ్యతిరేక పార్టీగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై ముద్ర ఉంది. ఈ చిన్న ఎజెండాను తీసుకుని హిందుత్వ పార్టీగా తన పేరును ఏర్పాటు చేసే పనిలో ఉన్నారట విజయసాయిరెడ్డి. తన పార్టీని భారతీయ జన వికాస్ గా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. మన దేశం, మన సమైక్యత, మన మతం అన్నట్టు ఈ పార్టీని హిందుత్వవాదంపై తీసుకువెళ్తారని తెలుస్తోంది. బిజెపికి దగ్గరగా ఈ పార్టీ విస్తరణ జరుగుతోందన్న టాక్ నడుస్తోంది. హిందూ అజెండాగా తీసుకుని పార్టీని మార్చి అప్పటి రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా పొత్తుల వైపు అడుగులు వేస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే ఇటీవల విజయసాయిరెడ్డి సోషల్ మీడియా ట్వీట్లు సైతం అలానే ఉన్నాయి. ఆగస్టు 15న చాలా గ్రాండ్ గా తన పార్టీని ప్రకటించేందుకు విజయసాయిరెడ్డి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Related News

Most Popular

Oktelugu Epaper