
ఏపీలో కరోనా కేసులు కాస్త పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 63,717 మంది నమూనాలు పరీక్షించగా 1,502 కొత్త కేసులు నమోదయ్యాయి. 16 మంది మరణించారు. కరోనా నుంచి నిన్న 1,525 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 14,883 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్య శాఖ బులెటిన్ లో తెలిపింది. కొవిడ్ వల్ల పశ్చిమగోదావరిలో ముగ్గురు, తూర్పుగోదావరిలో ఇద్దరు, గుంటూరులో ఇద్దరు, కర్నూలులో ఒకరు, ప్రకాశంలో ఒకరు మరణించారు.