Homeలైఫ్ స్టైల్Money Management: ఎక్కువగా కష్టపడకుండా డబ్బు సంపాదించడం ఎలా?

Money Management: ఎక్కువగా కష్టపడకుండా డబ్బు సంపాదించడం ఎలా?

Money Management: చాలా మంది జీవితంలో రాత్రింబవళ్లు కష్టపడుతుంటారు. ఉద్యోగం, వ్యాపారం, అదనపు పనులు అంటూ ఆదాయం పెంచుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. అయినప్పటికీ కొంతమంది మాత్రం ఏళ్ల తరబడి మిడిల్ క్లాస్ స్థాయిని దాటలేకపోతారు. కష్టపడటం మాత్రమే సంపదను సృష్టించదని.. కష్టానికి సరైన దిశ, డబ్బుపై అవగాహన, భవిష్యత్ ప్రణాళిక కూడా తోడైతేనే ఆర్థికంగా ఎదగడానికి అవకాశం ఉంటుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అందుకోసం ఏం చేయాలి? ఎలాంటి ప్రణాళిక వేయాలి? ఉదాహరణకు ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి […]

Money Management: చాలా మంది జీవితంలో రాత్రింబవళ్లు కష్టపడుతుంటారు. ఉద్యోగం, వ్యాపారం, అదనపు పనులు అంటూ ఆదాయం పెంచుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. అయినప్పటికీ కొంతమంది మాత్రం ఏళ్ల తరబడి మిడిల్ క్లాస్ స్థాయిని దాటలేకపోతారు. కష్టపడటం మాత్రమే సంపదను సృష్టించదని.. కష్టానికి సరైన దిశ, డబ్బుపై అవగాహన, భవిష్యత్ ప్రణాళిక కూడా తోడైతేనే ఆర్థికంగా ఎదగడానికి అవకాశం ఉంటుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అందుకోసం ఏం చేయాలి? ఎలాంటి ప్రణాళిక వేయాలి?

ఉదాహరణకు ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి చెట్టుకు ఉన్న పండ్లను మాత్రమే చూస్తాడు. కానీ సంపన్నులు మాత్రం ఆ చెట్టు విత్తనం గురించి ఆలోచిస్తారు. అందుకనే చాలా మంది మిడిల్ క్లాస్ పీపుల్స్ అక్కడే ఉంటున్నారు… రిచ్ పీపుల్స్ మాత్రం మరింత రిచ్ గా ఆలోచిస్తున్నారు. అంటే ప్రస్తుతం వచ్చే ఆదాయాన్ని మొత్తం ఖర్చు చేయడం కాకుండా.. భవిష్యత్‌లో ఆదాయం తీసుకొచ్చే ఆదాయంపై దృష్టి పెట్టాలి.

ప్రతినెల జీతం వచ్చిన తర్వాత అవసరాలు, ఈఎంఐలు, షాపింగ్, వినోదం వంటి ఖర్చులు చేసి మిగిలిన డబ్బును పొదుపు చేస్తారు. ఈ విధానాన్ని మార్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆదాయం వచ్చిన వెంటనే కొంత మొత్తాన్ని పొదుపు, పెట్టుబడులకు కేటాయించి.. మిగిలిన మొత్తంతోనే నెలవారీ ఖర్చులను నిర్వహించడం మంచిది. ఇలా చేయడం వల్ల పెట్టుబడి పెట్టడం మన జీవితంలో ఒక అలవాటుగా మారుతుంది.

సంపద నిర్మాణానికి ముందు ఆర్థిక భద్రతను ఏర్పాటు చేసుకోవాలి. ఉద్యోగం పోవడం, అనారోగ్యం, కుటుంబ అత్యవసర పరిస్థితులు వంటి సందర్భాల్లో పెట్టుబడులను మధ్యలోనే వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి రాకుండా ఎమర్జెన్సీ ఫండ్ ఏర్పాటు చేసుకోవాలి. సాధారణంగా కొన్ని నెలల అవసరమైన ఖర్చులకు సరిపడే మొత్తాన్ని సులభంగా అందుబాటులో ఉండే సాధనాల్లో ఉంచుకోవచ్చు. ఇలా చేస్తే అనుకోని ఖర్చుల కోసం అప్పులపై ఆధారపడే పరిస్థితి తగ్గుతుంది.

ఆదాయం పెరగాలంటే సంపాదించే సామర్థ్యం కూడా పెరగాలి. అందుకే కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి సమయం, డబ్బు కేటాయించాలి. ఉద్యోగంలో ప్రమోషన్‌కు ఉపయోగపడే స్కిల్స్, టెక్నాలజీ, కమ్యూనికేషన్, మేనేజ్‌మెంట్ లేదా వ్యాపార నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం ద్వారా భవిష్యత్‌లో ఆదాయాన్ని పెంచుకునే అవకాశం ఉంటుంది.

సంపద సృష్టించాలంటే పొదుపు చేసిన డబ్బును సరైన పెట్టుబడి సాధనాల్లోకి మళ్లించడం ముఖ్యం. వ్యక్తిగత ఆర్థిక పరిస్థితి, లక్ష్యం, రిస్క్ సామర్థ్యాన్ని బట్టి ఫిక్స్‌డ్ డిపాజిట్లు, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, మ్యూచువల్ ఫండ్లు, షేర్లు వంటి వివిధ సాధనాలను పరిశీలించవచ్చు. పెట్టుబడి పెట్టే ముందు వాటి రిస్క్, రాబడి, కాలవ్యవధి గురించి తెలుసుకోవాలి. ముఖ్యంగా మార్కెట్ పెట్టుబడుల్లో తక్కువ కాలంలో భారీ లాభాల కోసం కాకుండా దీర్ఘకాలిక లక్ష్యంతో వ్యవహరించడం మంచిది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper