Homeఆంధ్రప్రదేశ్‌Kodali Nani: బిజెపిని లెక్క చేయని కొడాలి నాని!

Kodali Nani: బిజెపిని లెక్క చేయని కొడాలి నాని!

Kodali Nani: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి కొడాలి నాని దూకుడు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన అయిన దానికి కాని దానికి ఎలా విరుచుకుపడతారో తెలియంది కాదు. అయితే వైసిపి వాటిని తర్వాత ఆయన ఆచితూచి మాట్లాడుతున్నారు. అప్పుడప్పుడు మీడియా ముందుకు వచ్చి హాట్ కామెంట్స్ చేయడం అలవాటైన విద్య ఆయనకు. మొన్ననే ఒకసారి బయటకు వచ్చిన ఆయన చంద్రబాబు, పవన్, లోకేష్ లు ప్రధాని నరేంద్ర మోడీకి సాగిలాలు పడుతున్నారు అంటూ […]

Kodali Nani: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి కొడాలి నాని దూకుడు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన అయిన దానికి కాని దానికి ఎలా విరుచుకుపడతారో తెలియంది కాదు. అయితే వైసిపి వాటిని తర్వాత ఆయన ఆచితూచి మాట్లాడుతున్నారు. అప్పుడప్పుడు మీడియా ముందుకు వచ్చి హాట్ కామెంట్స్ చేయడం అలవాటైన విద్య ఆయనకు. మొన్ననే ఒకసారి బయటకు వచ్చిన ఆయన చంద్రబాబు, పవన్, లోకేష్ లు ప్రధాని నరేంద్ర మోడీకి సాగిలాలు పడుతున్నారు అంటూ యాక్షన్ చేసి కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేశారు. ప్రస్తుతం కొడాలి నాని కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

* జాతీయ అధ్యక్షుడు నియోజకవర్గం లో ఓటమి..
మొన్ననే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం చేసిన సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమాన్ని ఒక వేడుకలా జరిపారు. అయితే దీనిపై కూడా సెటైరికల్ గా మాట్లాడారు కొడాలి నాని. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హడావిడి చేశారని.. ప్రధాని నరేంద్ర మోడీ వెళ్లిన రెండు రోజులకే బీహార్లో బిజెపి ఓడిపోయింది అంటూ ఎద్దేవా చేశారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాన్ని కూడా కోల్పోయారని గుర్తు చేశారు. మధ్యప్రదేశ్ లో నీచాతి నీచంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేను బలవంతంగా తొలగించి.. ఉప ఎన్నికలు వచ్చేలా చేశారని.. కానీ అక్కడ రెట్టింపు మెజారిటీతో మళ్ళీ కాంగ్రెస్ గెలిచింది అంటూ చెప్పుకొచ్చారు. బిజెపి పని అయిపోయింది అన్నట్టు కొడాలి నాని కామెంట్స్ ఉన్నాయి.

* మారుతున్న వైసీపీ వైఖరి..
బిజెపి విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైఖరి మారుతుంది అన్న దానికి కొడాలి నాని వ్యాఖ్యలే కారణం. ఎందుకంటే కూటమి విషయంలో ఎన్నో రకాల విమర్శలు చేస్తూ వచ్చింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. టిడిపి తో పాటు జనసేన పై విరుచుకుపడేది. బిజెపి విషయంలో సాఫ్ట్ కార్నర్ తో ఉండేది. కానీ ఇప్పుడు కొడాలి నాని నేరుగా ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనను తప్పుపట్టారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నియోజకవర్గంలో ఓటమిని ఎద్దేవా చేశారు. ఆపై కాంగ్రెస్ పార్టీని సమర్థిస్తూ మాట్లాడారు. ఆ పార్టీ గెలుపును గొప్పగా వ్యాఖ్యానించారు. అయితే కొడాలి నాని ఈ తరహాలో ధైర్యం చేయడం చూస్తుంటే మాత్రం.. బిజెపికి లెక్క చేయనట్టే. మరి ఇప్పటికైనా రాష్ట్ర బిజెపి నేతలు నోరు తెరుస్తారా? లేదా? అన్నది చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper