Satya Comedian: వరుణ్ తేజ్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘కొరియన్ కనకరాజు’ రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకొని కేవలం 4 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని క్లీన్ హిట్ స్టేటస్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కేవలం 13 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ని జరుపుకున్న ఈ చిత్రానికి , 4 రోజుల్లో 14 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అంటే కోటి రూపాయిల లాభం వచ్చింది అన్నమాట. ఇక నుండి ఈ సినిమా రన్ లో వచ్చే ప్రతీ పైసా లాభమే, ఈ వీకెండ్ కూడా ఈ చిత్రానికి భారీ రేంజ్ లో వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రానికి వరుణ్ తేజ్ తీసుకున్న రెమ్యూనరేషన్ గురించి సోషల్ మీడియా లో హాట్ టాపిక్ నడుస్తోంది. ఈ చిత్రానికి ముందు వరుస ఫ్లాప్స్ కారణం గా ఆయన మార్కెట్ మొత్తం పొయ్యే పరిస్థితి ఏర్పడింది. అందుకే నిర్మాతకు ఆయనకు కేవలం 88 లక్షల రూపాయిల రెమ్యూనరేషన్ మాత్రమే ఇచ్చారట. కానీ ఈ చిత్రం లో కమెడియన్ గా చేసిన సత్య 1 కోటి 20 లక్షల రూపాయిల రెమ్యూనరేషన్ ని అందుకున్నట్టు సమాచారం. సినిమా ప్రారంభం నుండి చివరి వరకు హీరో పక్కనే ఉండే క్యారెక్టర్ ఆయనది. పైగా కేవలం సత్య కామెడీ కోసం థియేటర్స్ కి కదిలేంత ఆడియన్స్ ని ఆయన సంపాదించుకున్నాడు. అందుకే ఆయనకు అంత రెమ్యూనరేషన్ ఇచ్చారని అంటున్నారు. ఈ సినిమా కమర్షియల్ గా ఇంత పెద్ద అయ్యిందంటే అందుకు ప్రధాన కారణాల్లో సత్య కూడా ఒకడు. ఆయన కామెడీ ఈ సినిమాకు చాలా పెద్ద ప్లస్ అయ్యింది.
థియేటర్స్ లో ఆయన కామెడీ సన్నివేశాలకు ప్రేక్షకులు పొట్ట చెక్కలు అయ్యేలా నవ్వుతున్నారు. కాబట్టి ఆయనకు ఆ రేంజ్ రెమ్యూనరేషన్ ఇవ్వడం లో ఎలాంటి తప్పు లేదని అంటున్నారు నెటిజెన్స్. అయితే వరుణ్ తేజ్ కి ఇచ్చిన 88 లక్షలు కేవలం అడ్వాన్స్ మాత్రమేనా ?, సినిమా విడుదలయ్యాక సూపర్ హిట్ అయ్యింది కాబట్టి ఇప్పుడు అదనంగా ఆయన రెమ్యూనరేషన్ ఏమైనా ఇస్తారా అనేది తెలియాల్సి ఉంది. సినిమా థియేట్రికల్ రన్ అయితే చాలా స్టడీ గా ఉంది , నేడు ఈ చిత్రానికి బుక్ మై షో యాప్ లో గంటకు 3 నుండి 4 వేల టిక్కెట్లు అమ్ముడుపోతున్నాయి. ఇదే రేంజ్ కొనసాగితే మాత్రం కచ్చితంగా ఈ సినిమా ఈ ఏడాది అత్యధిక లాభాలను రాబట్టిన సినిమాల జాబితాలోకి చేరిపోతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.