India Pakistan Tensions : 2014కు ముందు భారత రాజకీయాల్లో నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అవ్వడం చాలా మందికి ఊహించలేని విషయంగా కనిపించింది. యూపీఏ ప్రభుత్వం కొనసాగుతున్న సమయంలో బీజేపీకి మద్దతు ఇచ్చిన కొన్ని పార్టీలు కూడా వేరే దిశగా మళ్లాయి. అయినప్పటికీ 2014 లోక్‌సభ ఎన్నికలు బీజేపీకి ఒంటరిగా మెజారిటీ సాధించే అవకాశం కల్పించాయి. ఇది జాతీయ స్థాయిలో నాయకత్వం, ప్రచార వ్యూహం, ప్రజల అసంతృప్తి బీజేపీకి ప్లస్ అయ్యాయి.
2014 నుంచి 2019 వరకు..
2014లో బీజేపీ ఘన విజయం సాధించి మోదీ ప్రధానమంత్రి అయ్యారు. ఆ తర్వాత 2019 ఎన్నికలకు ముందు ఇక 2019 నాటికి మోదీ పని అయిపోయింది అని అనుకున్నారు. అన్ని పత్రికలు కథనాలు కూడా రాశాయి. 2019 ఎన్నికలకు ముందే పుల్వామా ఘటన జరిగింది. కశ్మీర్‌లో ఉగ్రవాదులు బహిరంగంగా హెచ్చరిక చేశారు. పాకిస్తాన్‌లో కూర్చుని ప్రకటనలు ఇచ్చారు. లష్కర్ ఎ తోయిబా, హిజ్‌బుల్ ముజాహిద్దీన్ అధినేత మోదీకి మా దెబ్బ చూపించాం ఇక అయిపోయాడు అని ప్రకటించారు. భారత దేశంలో ఉగ్రదాడి చేస్తే భారతీయులే మోదీని ఓడించబోతున్నారని ప్రకటించారు. కానీ సర్జికల్ స్ట్రైక్ 2, బాలాకోట్ ఎటాక్ ఇంపాక్ట్ తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. 2019 ఎన్నికల్లో 303 సీట్ల బంపర్ మెజారిటీతో కేంద్రంలో బీజేపీ మరోమారు అధికారంలోకి వచ్చింది.
విపక్షాల డీప్ స్టేట్ ఎత్తుగడలు..
అప్పటి నుంచే డీప్ స్టేట్ ప్లానింగ్ దేశంలోని ఇండియా కూటమి, ఆప్, సమాజ్‌వాదీ పార్టీ, ఆర్జేడీ, బీఎస్పీ తప్ప మిగతా అందరూ కలిసిపోయారు. ఇందుకు డీప్ స్టేట్ అమెరికా నుంచి తెరవెనుక నడిపించింది. చైనా నుంచి మద్దతుతో కమ్యూనిస్టులు కూడా అందులో దూరారు. దీంతో 2024 ఎన్నికల్లో బీజేపీ కాస్త వెనక్కు తగ్గేలా చేశారు. సీట్లు తగ్గించారు. అయితే ఈ విషయం ముందే పసిగట్టిన బీజేపీ కర్ణాటకలో జేడీఎస్‌తో, ఏపీలో టీడీపీ, జనసేనతో చివరి నిమిషంలో పొత్తు పెట్టుకుంది. దీంతో 2024 ఎన్నికల్లోనూ మళ్లీ గెలిచి అధికారంలోకి వచ్చింది. వరుసగా మూడోసారి మోదీ ప్రధాని అయ్యారు.
యుద్ధానికి సిద్ధమవుతున్న పాకిస్తాన్..
పాకిస్తాన్‌లో అంతర్గత అస్థిరత, ఉద్యమాలు, హింసాత్మక సంఘటనలు కొనసాగుతున్న నేపథ్యంలో, సరిహద్దు సమస్యలు భారత రాజకీయాలపై ప్రభావం చూపగలవు. గతంలో పుల్వామా వంటి సంఘటనలు, తర్వాతి సైనిక చర్యలు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేశాయి. ఇటీవలి సంఘటనలు (పహల్గామ్ వంటివి) వాటికి ప్రతిస్పందనలు ప్రజల్లో భద్రతా అవగాహనను పెంచాయని చాలా మంది గమనిస్తున్నారు. ఒకవేళ సరిహద్దు ఉద్రిక్తతలు పెరిగితే, అవి రాజకీయ చర్చను భద్రతా అంశాల వైపు మళ్లించగలవు. దీంతో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుందన్న ఆందోళన విపక్షాల్లో నెలకొంది.
యుద్ధం జరగొద్దని..
ఇప్పుడు 2029 ఎన్నికల వైపు చూస్తే, విపక్షాలు వివిధ మార్గాలు అన్వేషిస్తున్నాయి. ఆప్ నాయకత్వం యువ నాయకులను ముందుకు తీసుకురావడం, రాహుల్ గాంధీ యువతరం మద్దతు గురించి ప్రచారం చేయడం వంటివి కనిపిస్తున్నాయి. అయితే ఈ వ్యూహాలు ఎంతవరకు ఓటర్ల మనసులను మారుస్తాయనేది ఇంకా స్పష్టం కాలేదు. మరోవైపు మోదీని ఓడించాలంటే పాకిస్తాన్ భారత్‌తో యుద్ధం చేయొద్దని కోరుకుంటున్నారు. యుద్ధం జరిగితే 2029లోనూ బీజేపీకి తిరుగు ఉండదని భావిస్తున్నారు.
2014 నుంచి 2024 వరకు బీజేపీ నాయకత్వం ఎన్నికల్లో బలంగా నిలిచింది. భవిష్యత్తులో కూడా ఎన్నికల ఫలితాలు కేవలం ఒకే అంశం లేదా ఒకే వ్యూహంతో కాకుండా, ప్రజల అనుభవాలు, పాలనా ఫలితాలు, బాహ్య సవాళ్లు, ప్రత్యర్థుల సమన్వయం వంటి అనేక కారకాల మీద ఆధారపడి ఉంటాయి.