spot_img
Homeజాతీయ వార్తలుPM Modi and Joe Biden: జోబైడెన్ తో మోడీ భేటి ఫిక్స్.. ఏం జరుగనుంది?

PM Modi and Joe Biden: జోబైడెన్ తో మోడీ భేటి ఫిక్స్.. ఏం జరుగనుంది?

PM Modi and Joe BidenPM Modi and Joe Biden: అంతర్జాతీయంగా సమస్యలు పెరిగిపోతున్నాయి. ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రపంచమే ఓ కుగ్రామంగా మారిపోతోంది. ఒకప్పుడు ఉన్న పరిస్థితులు వేరు ప్రస్తుతం కొనసాగుతున్న దుర్భర స్థితులు వేరుగా ఉంటున్నాయి. దీంతో దేశాల్లో ఆందోళనలు నెలకొంటున్నాయి. ఈ క్రమంలో అన్ని దేశాలు తమ మద్దతు కోసం పరితపిస్తున్నాయి. అది గ్లోబల్ వార్మింగ్ అయినా, తాలిబన్ల సమస్య అయినా, కరోనా నేపథ్యం కూడా కావచ్చు. కానీ ప్రపంచ దేశాల్లో సమన్వయం అవససరం ఏర్పడింది. అన్ని దేశాల సహకారం అత్యవసరం అవుతోంది. దీంతో పలు దేశాలు ఒక కూటములుగా ఏర్పడడం తెలిసింది.

అమెరికా, జపాన్, ఆస్రేలియా, బ్రిటన్, ఇండియా దేశాలు కలిసి క్వాడ్ దేశాల సమాఖ్యగా ఏర్పడ్డాయి. దీంతో వాటి మధ్య సహాయ సహకారాల కోసం ఐకమత్యంగా పోరాడేందుకు సిద్ధమయ్యాయి. ఇందుకోసం సెప్టెంబర్ 24న అమెరికా అధ్యక్షుడు, అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ మధ్య ఇరు దేశాధినేతల మధ్య సమావేశం జరగనుంది. దీనికి సంబంధించిన విధి విధానాలు ఖరారయ్యాయి. ఈ మేరకు అమెరికా వైట్ హౌస్ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది.

బైడెన్ తో జరిగే సమావేశంలో పలు చర్చలపై సుదీర్ఘంగా చర్చించనున్నట్లు తెలిసింది. ద్వైపాక్షిక అంశాల్లో పలు రకాల సమస్యలపై అవగాహన రానున్నట్లు తెలుస్తోంది. తాలిబన్ల ఆక్రమణ నేపథ్యంలో చోటుచేసుకునే పరిస్థితులు, కోవిడ్ -19 వ్యాక్సినేషన్ తదితర విషయాలపై ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇరు దేశాల మధ్య పలు కీలక అంశాలపై పరిష్కారాలు లభించనున్నట్లు సమాచారం.

క్వాడ్ కూటమి సదస్సులో ప్రధాని మోడీ జపాన్ ప్రధాని యోషిహిడే సుగ, ఆస్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ లతో కూడా సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీ అనంతరం ఇండో-పసిఫిక్ సముద్రంలో చైనా ప్రాబల్యాన్ని తగ్గించేందుకు కూడా ఓ నిర్ణయానికి రానున్నట్లు సమాచారం. చైనా తన కుయుక్తులతో ఇతర దేశాల సార్వభౌమత్వాన్ని గుర్తించడం లేదని తెలుస్తోంది. అందుకే క్వాడ్ వేదికగా సభ్య దేశాలు పోరాటం సాగించేందుకు నిర్ణయించినట్లు చెబుతున్నారు.

మరో వైపు ప్రపంచంలో సమస్యలు నానాటికి పెరిగిపోతున్నాయి. గ్లోబల్ వార్మింగ్ లో భాగంగా ప్రపంచంలోని భూభాగం వేడెక్కిపోతోందని తెలుస్తోంది. అభివృద్ధి చెందిన దేశాలే అభివృద్ధి చెందుతున్న దేశాలకు కంటకంగా మారుతున్నాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇతర దేశాల సమస్యలు కూడా పట్టించుకుని గ్లోబల్ వార్మింగ్ సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

Sidiri Appalaraju Arrest

Sidiri Appalaraju Arrest: అరెస్టు చేసే దాకా తెచ్చుకున్న ఆ మాజీ మంత్రి!

Sidiri Appalaraju Arrest: ఎట్టకేలకు మాజీమంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సీదిరి అప్పలరాజు అరెస్టయ్యారు. అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మ నడిపిన బైక్ ఢీకొని దానయ్య అనే గొర్రెల కాపరి...
Healthy Dinner

Healthy Dinner: రాత్రి సమయంలో ఈ ఆహారం తింటున్నారా…

Healthy Dinner: ప్రస్తుత కాలంలో చాలామంది నిద్ర సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే కొందరు ఉద్యోగాలు ఇతర కారణాలతో ఒత్తిడిని ఎదుర్కొని సరైన నిద్ర పోవడం లేదు. మరికొందరు రాత్రి సమయంలో జీర్ణం...
RRB JE Recruitment 2026

RRB JE Recruitment 2026: రైల్వేలో యువతకు బంపర్‌ ఆఫర్.. ఈ ఛాన్స్‌ మిస్‌ చేసుకోకండి!

RRB JE Recruitment 2026: భారతీయ రైల్వేలు దేశంలోని అతిపెద్ద పబ్లిక్‌ సెక్టార్‌ సంస్థల్లో ఒకటి. ఇప్పుడు ఆ సంస్థలోని ముఖ్యమైన టెక్నికల్‌ పోస్టులను భర్తీ చేయడానికి రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డులు (ఆర్‌ఆర్‌బీ)...
Cockroach Facts

Cockroach Facts: తల లేకపోయినా ఈ జీవి బతుకుతుంది.. సృష్టికే సవాల్ విసిరే దీని కథేంటో తెలుసా

Cockroach Facts: ఒక నిమిషం గాలి పీల్చుకోకుండా మనం ఉండగలుగుతామా.. అక్కడి దాకా ఎందుకు తల లేకుండా బతకగలుగుతామా.. ఇది సాధ్యమవుతుందా.. కానీ ఆ జీవి విషయంలో సాధ్యమవుతుంది. ఎందుకంటే అది సృష్టికే...
JP Nadda

JP Nadda: నడ్డా చెప్పింది నిజమే.. పేపర్ లీక్ ల గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ కు లేదు..

JP Nadda: ఈ దేశంలో పేపర్ లీక్ ల గురించి మాట్లాడే అర్హత ఏ పార్టీకి కూడా లేదు. ఈ మాట నూటికి నూరు శాతం కాదు కోటి శాతం నిజం....
Oktelugu Epaper