Homeఎంటర్టైన్మెంట్Sai Dharam Tej: మెగాస్టార్ చిరంజీవి కే సవాల్ విసురుతున్న సాయి ధరమ్ తేజ్.. షాక్...

Sai Dharam Tej: మెగాస్టార్ చిరంజీవి కే సవాల్ విసురుతున్న సాయి ధరమ్ తేజ్.. షాక్ లో మెగా ఫ్యాన్స్..

Sai Dharam Tej: ఒకే ఫ్యామిలీ కి చెందిన ఇద్దరి హీరోల సినిమాలు విడుదల అవ్వడం మన టాలీవుడ్ లో చాలా అరుదు. గతం లో ఎన్టీఆర్ ‘నాన్నకు ప్రేమతో’, బాలకృష్ణ ‘డిక్టేటర్’ చిత్రాలు మాత్రమే ఒక్క రోజు గ్యాప్ తో విడుదల అయ్యాయి. ఆ తర్వాత ఒకే ఫ్యామిలీ కి మళ్లీ ఇలాంటి సందర్భం రాలేదు. అయితే 2027 వ సంవత్సరం సంక్రాంతికి ఈ అరుదైన ఫీట్ రిపీట్ అవ్వడం పక్కా లాగా ఉంది. పూర్తి […]

Sai Dharam Tej: ఒకే ఫ్యామిలీ కి చెందిన ఇద్దరి హీరోల సినిమాలు విడుదల అవ్వడం మన టాలీవుడ్ లో చాలా అరుదు. గతం లో ఎన్టీఆర్ ‘నాన్నకు ప్రేమతో’, బాలకృష్ణ ‘డిక్టేటర్’ చిత్రాలు మాత్రమే ఒక్క రోజు గ్యాప్ తో విడుదల అయ్యాయి. ఆ తర్వాత ఒకే ఫ్యామిలీ కి మళ్లీ ఇలాంటి సందర్భం రాలేదు. అయితే 2027 వ సంవత్సరం సంక్రాంతికి ఈ అరుదైన ఫీట్ రిపీట్ అవ్వడం పక్కా లాగా ఉంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే సాయి ధరమ్ తేజ్ హీరో గా నటించిన భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రం ‘సంబరాల ఏటిగట్టు’ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా , జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ విషయాన్ని రీసెంట్ గానే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. సుమారుగా రెండేళ్ల నుండి సెట్స్ మీదున్న చిత్రమిది.

బడ్జెట్ సమస్యల కారణంగా కొన్ని రోజులు షూటింగ్ ఆగిపోయింది. మళ్లీ రీసెంట్ గానే పునః ప్రారంభించి , దాదాపుగా షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసేశారు . ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. లాంగ్ అవైటెడ్ చిత్రానికి ఎట్టకేలకు మంచి సీజన్ దొరికింది , ఇక సాయి ధరమ్ తేజ్ ఖాతాలో మరో సూపర్ హిట్ పడబోతుందని అంతా అనుకున్నారు. కానీ ఇదే సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి , బాబీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. ఇప్పటి వరకు ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ని 40 రోజుల పాటు చిత్రీకరించరాట. ఫస్ట్ హాఫ్ కి సంబంధించిన ఎడిట్ కూడా లాక్ అయ్యిందట. లేటెస్ట్ షెడ్యూల్ విరామం లేకుండా హైదరాబాద్ లో సాగుతోంది. మిగిలిన షూటింగ్ అక్టోబర్ నెలాఖరు లోపు పూర్తి చేసి, సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చెయ్యాలనే ప్లాన్ లో ఉన్నారట మేకర్స్.

గతంలో చిరంజీవి , బాబీ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ టాక్ ని సొంతం చేసుకొని , సంక్రాంతి విన్నర్ గా నిల్చింది. మళ్లీ వీళ్లిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కే సినిమా , ఇదే సీజన్ లో రాబోతుండడం గమనార్హం. మరి ఈ సినిమాకు పోటీ సాయి ధరమ్ తేజ్ ‘సంబరాల ఏటి గట్టు’ నిలుస్తుందా ?, లేదా చిరంజీవి మీద గౌరవం తో సంక్రాంతి రేసు నుండి తప్పుకుంటారా అనేది వేచి చూడాలి. ఒకవేళ రెండు సినిమాలు పోటీ పడితే మాత్రం మెగా ఫ్యాన్స్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Related News

Most Popular

Oktelugu Epaper