Homeజాతీయ వార్తలుModi Cabinet Reshuffle: మోడీ కీలక నిర్ణయం.. తెలంగాణ ప్రాంత మంత్రుల పోస్టులు ఊస్ట్

Modi Cabinet Reshuffle: మోడీ కీలక నిర్ణయం.. తెలంగాణ ప్రాంత మంత్రుల పోస్టులు ఊస్ట్

Modi Cabinet Reshuffle: ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో జంతర్మంతర్ వద్ద నీట్ పేపర్ లీకేజీ పై యువత ఉద్యమించిన విషయం తెలిసిందే. ఈ ఉద్యమం ఏకంగా దేశ విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో రాజీనామా చేసేదాకా వెళ్ళింది. అయితే ఈ ఎఫెక్ట్ ఇక్కడితోనే ఆగిపోవడం లేదు. వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభావం ఉండకూడదని నరేంద్ర మోడీ ముందుగానే నిర్ణయించుకున్నారు. ఈ ప్రకారం ఆయన కేంద్ర మంత్రివర్గంలో కీలకంగా మార్పులు చేపట్టబోతున్నారు. జాతీయ మీడియాలో […]

Modi Cabinet Reshuffle: ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో జంతర్మంతర్ వద్ద నీట్ పేపర్ లీకేజీ పై యువత ఉద్యమించిన విషయం తెలిసిందే. ఈ ఉద్యమం ఏకంగా దేశ విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో రాజీనామా చేసేదాకా వెళ్ళింది. అయితే ఈ ఎఫెక్ట్ ఇక్కడితోనే ఆగిపోవడం లేదు. వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభావం ఉండకూడదని నరేంద్ర మోడీ ముందుగానే నిర్ణయించుకున్నారు. ఈ ప్రకారం ఆయన కేంద్ర మంత్రివర్గంలో కీలకంగా మార్పులు చేపట్టబోతున్నారు.

జాతీయ మీడియాలో వస్తున్న వార్తలు ప్రకారం బిజెపి అధిష్టానం పార్టీ సంస్థ గత నిర్మాణం మీద దృష్టి పెట్టింది. ఇక్కడితోనే ఆగడం లేదు నరేంద్ర మోడీ ఏకంగా తన కేబినెట్లో భారీ మార్పులకు శ్రీకారం చుట్టారు. ఇటీవల బీజేపీ నూతన జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తన యువ టీమ్ ను ప్రకటించారు. అంతేకాదు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంత్రివర్గాన్ని పునర్ వ్యవస్థీకరించబోతున్నారు.

ఐటి సెల్ లో మార్పులు

యువతకు బిజెపి ని దగ్గర చేయడానికి నరేంద్ర మోడీ ప్రయత్నాలు చేస్తున్నారు. అందువల్ల ఇటీవల వరుసగా ఆయన వీడియోలు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. డిజిటల్ వ్యూహాన్ని కూడా పూర్తిగా మార్చాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే బిజెపి ఐటీ సెల్ హెడ్గా ఉన్న అమిత్ మాలవ్యను ఆ బాధ్యతల నుంచి తప్పించారు.. ఇతని ప్రాంతంలో చతిస్గఢ్ ప్రాంతానికి చెందిన దీపక్ మస్కేను బిజెపి ఐటీ సెల్ హెడ్గా నియమించారు. దీనికి తోడు ట్విట్టర్ కంటే కూడా ఇన్ స్టా గ్రామ్ రీల్స్ లోనే యాక్టివ్ గా ఉండాలని.. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నరేంద్ర మోడీ సూచించారు.

కేంద్ర మంత్రివర్గంలో మార్పుల కంటే ముందుగానే బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ తన టీం లోకి స్మృతి ఇరానీని తీసుకున్నారు. రామ్ మాధవ్ కు బిజెపి వైస్ ప్రెసిడెంట్ హోదా ఇచ్చారు. బిజెపి యువ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా ఉన్న తేజస్వి స్థానంలో హేమంగ్ ను నియమించారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ జాతీయ కోశాధికారిగా ప్రమోషన్ లభించింది.

నరేంద్ర మోడీ క్యాబినెట్లో యువకులకు అవకాశం దక్కబోతున్నట్టు తెలుస్తోంది. సరిగ్గా పనిచేయలేని మంత్రులకు ఉద్వాసన పలికే అవకాశం ఉంది. వారికి పార్టీ బాధ్యతలు అప్పగించే అవకాశం కల్పిస్తోంది. ఏకంగా 38 మంత్రుల శాఖలు మారుతాయని సమాచారం. ఇక రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు మంత్రుల పదవులకు గండం పొంచి ఉంది. ఇక కూటమిలో కీలకమైన భాగస్వామి పార్టీగా ఉన్న జనసేనకు ఒక కేంద్ర సహాయ మంత్రి పదవి లభించే అవకాశం ఉంది. మొత్తానికి ప్రధాని నరేంద్ర మోడీ యువత వ్యక్తం చేస్తున్న సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నారు. 2029 నాటికి యంగ్ పార్టీగా బిజెపిని రూపు దిద్దడానికి ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper