Viswanath And Sons: సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమా ప్రేక్షకుల మన్ననలు పొందుతుంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ను ఈ సినిమాను చాలా వరకు కట్టిపడేస్తుందనే చెప్పాలి. ఇప్పటికి ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళ్ సినిమా ఇండస్ట్రీలో కూడా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో నడుస్తూ ముందుకు దూసుకెళ్తుండడం విశేషం… ఇక ఏది ఏమైనా కూడా సూర్య కెరియర్ లోనే ఈ సినిమా బిగ్గెస్ట్ సక్సెస్ గా నిలవడమే కాకుండా హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచే అవకాశాలు కూడా ఉన్నాయని సినిమా మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు… ఈ మూవీ ఫస్టాఫ్ విషయానికి వస్తే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. సెకండాఫ్ లో కొంచెం ఎమోషనల్ సన్నివేశాలను ఎక్కువగా ఆడ్ చేసి సినిమా కంటెంట్ ను డల్యూట్ చేశారు…
మరి కొంతమంది మాత్రం తెలుగు సినిమా ఇండస్ట్రీలో త్రివిక్రమ్ ఎలాంటి స్ట్రాటజీతో ముందుకు సాగుతాడో వెంకీ అట్లూరి సైతం సెకండాఫ్ ను అదేవిధంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడని అందువల్లే ఈ సినిమా సెకండ్ హాఫ్ కొంచెం డల్ అయిందని,
అయినప్పటికి మొత్తానికైతే క్లైమాక్స్ మాత్రం చాలా ఎక్స్ట్రార్డినర్ గా ఉండడంతో ఓవరాల్ గా సినిమా సక్సెస్ ఫుల్ టాక్ ని సంపాదించుకొని ముందుకు దూసుకెళ్తుందని మరి కొంతమంది చెబుతున్నారు. ఇక సెకండాఫ్ ను అలా డిజైన్ చేయడానికి గల కారణం ఏంటంటే ?
త్రివిక్రమ్ సలహాలు సూచనలు కూడా ఇందులో కొంతవరకు భాగం అయ్యాయని వాటిని అనుసరిస్తూనే వెంకీ అట్లూరి సెకండాఫ్ ని రాసుకున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా సక్సెస్ ఫుల్ టాక్ వచ్చింది. కాబట్టి సినిమా పలు రికార్డ్ లను కొల్లగొడుతుంది. ఇక మొత్తానికైతే ఈ సినిమా లాంగ్ రన్ లో ఎంతటి కలెక్షన్స్ ని రాబడుతుందనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…