Pawan Kalyan Craze: లక్షలాది మంది ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజల కోరిక ని నెరవేరుస్తూ నేడు భోగాపురం లో ‘అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ విమానాశ్రయం’ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా , లక్షలాది మంది జన సందోహం నడుమ , ఎంతో అట్టహాసం గా జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ , మంత్రి నారాలోకేష్ , కేంద్ర విమాయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తదితరులు ముఖ్య అతిధులుగా గాజరయ్యారు. వేలాది మంది గిరిజనులు సాంస్కృతిక ధింసా నృత్యం తో ప్రధాని మోడీ కి అపూర్వమైన స్వాగతం పలికారు. అయితే ఈ సభలో సీఎం చంద్రబాబు , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గురించి మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
ఒక విధంగా చెప్పాలంటే వీళ్లిద్దరు మోడీ పట్ల చాలా ఎమోషనల్ కి గురయ్యారు. ఇదంతా పక్కన పెడితే ఒక సభకు పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు , ఆ ప్రాంగణం వాతావరణం మొత్తం పూర్తిగా మారిపోతుంది. పీఎం , సీఎం ఇలా ఎవరున్నా జనాలు పట్టించుకోరు. పవన్ కళ్యాణ్ కోసమే గొంతులు పడిపోయే రేంజ్ లో అరుస్తుంటారు. నేడు కూడా అలాంటి వాతావరణమే సభ ప్రాంగణం వద్ద ఏర్పడింది. పవన్ కళ్యాణ్ మైక్ అందుకోవడానికి ముందుకు వస్తున్న సమయం లో , అభిమానుల కేరింతలు , చప్పట్లతో సభ ప్రాంగణం మొత్తం దద్దరిల్లిపోయింది. పవన్ కళ్యాణ్ క్రేజ్ ని చూసి పీఎం మోడీ , సీఎం చంద్రబాబు నాయుడు ఎంతగానో మురిసిపోయారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో సంచలనంగా మారింది. ఎక్కడ చూసినా దీని గురించే చర్చ. పీఎం మోడీ ని సైతం పవన్ క్రేజ్ షాక్ కి గురి చేసిందంటే, ఆయన స్థాయి ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
అయితే పవన్ కళ్యాణ్ అభిమానులకు ఇవి చాలా కామన్ అయిపోయాయి. ప్రతీ సభలోనూ ఇదే తరహా రెస్పాన్స్ రావడం చూసి చూసి విసిగిపోయారు. కాబట్టి వాళ్ళు దీన్ని పెద్ద గొప్పగా భావించడం లేదు , ‘ఏముంది , కామన్ కదా ఇలాంటివి పవన్ కళ్యాణ్ ఉండే సభల్లో’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే ee సభలో పవన్ కళ్యాణ్ ఇటీవల కాలం లో దేశం లో జరిగిన జెన్ జీ ప్రొటెస్ట్ గురించి మాట్లాడుతూ , దేశం కోసం ఎంతో కష్టపడి ప్రధాన మంత్రి మోడీ కి ఇదేనా మనం ఇచ్చే విలువ, ఏమి తెలుసు నేటి తరం వారికి మోడీ పడ్డ కష్టం, ఇప్పుడే కాదు , భవిష్యత్తులో కూడా దేశంలో మోడీ ని బీట్ చేసే లీడర్ ఉండరు అంటూ పవన్ కళ్యాణ్ ఎమోషనల్ కామెంట్స్ చేశారు.