Homeఆంధ్రప్రదేశ్‌CM Chandrababu: అప్పుడు కొబ్బరికాయ.. ఇప్పుడు గుమ్మడికాయ.. మోడీ లాంటి నేతను చూడలే.. చంద్రబాబు

CM Chandrababu: అప్పుడు కొబ్బరికాయ.. ఇప్పుడు గుమ్మడికాయ.. మోడీ లాంటి నేతను చూడలే.. చంద్రబాబు

CM Chandrababu:  భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టింది మనమే.. ప్రారంభోత్సవానికి గుమ్మడికాయ కొట్టింది మనమే అంటూ అభివర్ణించారు ఏపీ సీఎం చంద్రబాబు. అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవం సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు ప్రసంగించారు. ప్రధాని నరేంద్ర మోడీ సహకారంతోనే ఉత్తరాంధ్ర స్వరూపాన్ని మార్చుకున్నట్లు చెప్పుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే ఉత్తరాంధ్రలో 189 ప్రాజెక్టులకు పెట్టుబడులు వస్తున్నట్లు ప్రకటించారు. 12 ఏళ్లుగా ఈ దేశాన్ని సమర్ధవంతంగా నడిపిస్తున్న నేత మోడీ అని కొనియాడారు. డిజిటల్ ఇండియా […]

CM Chandrababu:  భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టింది మనమే.. ప్రారంభోత్సవానికి గుమ్మడికాయ కొట్టింది మనమే అంటూ అభివర్ణించారు ఏపీ సీఎం చంద్రబాబు. అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవం సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు ప్రసంగించారు. ప్రధాని నరేంద్ర మోడీ సహకారంతోనే ఉత్తరాంధ్ర స్వరూపాన్ని మార్చుకున్నట్లు చెప్పుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే ఉత్తరాంధ్రలో 189 ప్రాజెక్టులకు పెట్టుబడులు వస్తున్నట్లు ప్రకటించారు. 12 ఏళ్లుగా ఈ దేశాన్ని సమర్ధవంతంగా నడిపిస్తున్న నేత మోడీ అని కొనియాడారు. డిజిటల్ ఇండియా గా మార్చిన ఘనత కూడా ఆయనకే దక్కుతుందని చెప్పుకొచ్చారు. రోడ్లు, రైల్వేలు, విమానాశ్రయాలను ముందుచూపుతో నిర్మిస్తున్నారని చెప్పుకొచ్చారు. సౌర శక్తితో పాటు గ్రీన్ హైడ్రోజన్ ద్వారా కాలుష్యాన్ని తగ్గించి ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం సుభిక్షంగా ఉంటుందని ఆనందం వ్యక్తం చేశారు చంద్రబాబు.

* మోడీ లాంటి నేతను చూడలే..
నా రాజకీయ జీవితంలో మోడీ లాంటి నేతను చూడలేదని.. ప్రతి విషయంలోనే నేషన్ ఫస్ట్ అనే చూసే వ్యక్తి మోడీ అని.. 2047 నాటికి ప్రపంచంలోనే అగ్రగామిగా భారత్ను తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నారని కొనియాడారు. అంతకుముందు చంద్రబాబు భోగాపురం విమానాశ్రయ నిర్మాణంలో భాగస్తులైన ఉత్తరాంధ్ర వాసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గతంలో పౌర విమానయాన శాఖ మంత్రిగా, భోగాపురం ఎయిర్పోర్ట్ స్థల ఎంపిక చేసిన అశోక్ గజపతిరాజును, ప్రస్తుత పౌర విమానయాన శాఖ మంత్రి, గత రెండేళ్లలో పనులను వేగవంతం చేసిన కింజరాపు రామ్మోహన్ నాయుడుని సైతం హ్యాపీ వర్తించారు. దీని నిర్మాణ బాధ్యతలను చూసిన జిఎంఆర్ ను సైతం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు సీఎం చంద్రబాబు.

* మారనున్న ఉత్తరాంధ్ర రూపురేఖలు..
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంతో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారిపోతాయని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే ఈ విమానాశ్రయానికి భూములు ఇచ్చిన రైతులకు పాదాభివందనం అంటూ ప్రకటన చేశారు. ఈ ఎయిర్పోర్ట్ తో ఈ ప్రాంతం దిశ, దశ మారిపోతాయని.. ఉత్తరాంధ్రకు దిగ్గజ ఐటీ సంస్థలు, తయారీ రంగ పరిశ్రమలు వచ్చాయని.. మరిన్ని వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. విధ్వంసమైన రాష్ట్రాన్ని రెండేళ్లలో గాడిన పెట్టి చూపించామని.. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ సహకారం మరువలేనిదని చెప్పుకొచ్చారు. రాష్ట్రానికి ఆక్సిజన్ ఇచ్చిన వ్యక్తి మోదీ అని అభివర్ణించారు. అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్ట్, ప్రత్యేక రైల్వే జోన్, విశాఖ ఉక్కును కాపాడిన వ్యక్తి మోదీ అని తేల్చి చెప్పారు. 2028 నాటికి అమరావతి మొదటి దశ పనులను పూర్తి చేసి ప్రధాని నరేంద్ర మోడీ చేతులుగా ప్రారంభిస్తామని ప్రకటించారు చంద్రబాబు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper