Express Hari : జబర్దస్త్ షో ద్వారా మంచి పాపులారిటీ ని సంపాదించి , ఆ తర్వాత ఎన్నో టీవీ షోస్ లో కమెడియన్ గా కొనసాగుతూ, ప్రస్తుతం స్టార్ మా ఛానల్ లో టెలికాస్ట్ అయ్యే ప్రతీ ఎంటర్టైన్మెంట్ షో కి స్క్రిప్ట్, డైలాగ్ రైటర్ గా కొనసాగుతూనే , తనదైన టైమింగ్ తో కమెడియన్ గా కూడా కొనసాగుతున్న వ్యక్తి ఎక్స్ ప్రెస్ హరి. ఈయన రైటర్ గా వ్యవహరిస్తూ , కమెడియన్ గా కొనసాగుతున్న ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’ షో మొదలై ఈ వారం తో 200 వారాలు పూర్తి అయ్యింది. అంటే అక్షరాలా 200 ఎపిసోడ్స్ అన్నమాట. 200 వ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ని కాసేపటి క్రితమే విడుదల చేశారు మేకర్స్. ఈ ప్రోమో మొత్తం ఒక ఎత్తు , చివర్లో వచ్చిన ట్విస్ట్ మరొక ఎత్తు అని చెప్పొచ్చు.
200 వ ఎపిసోడ్ సందర్భంగా మీకొక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాము అంటూ శ్రీముఖి అంటుంది. హరి త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడని , పెళ్లి కూతురు ఇండస్ట్రీ కి చెందిన అమ్మాయి అని అంటుంది. అప్పుడు ఎక్స్ ప్రెస్ హరి సిగ్గు పడడం, పెళ్లి కూతుర్ని ఒక పల్లకి లో ముసుగు కప్పి తీసుకొని రావడం, ఆ తర్వాత శ్రీముఖి ముసుగు తీయడం జరుగుతుంది. అయితే పెళ్లి కూతురు ముఖాన్ని మాత్రం చూపించలేదు. ఆమె ఎవరో తెలియాలంటే ఈ ఆదివారం వరకు ఆగాల్సిందే. అయితే ఇది నిజంగానే హరి పెళ్ళికి సంబంధించిన ప్రకటనేనా ?, లేదంటే ఎప్పటి లాగానే ఈసారి కూడా ప్రాంక్ చేశారా అనేది చూడాలి. ఇప్పటి వరకు నిజమైన పెళ్లి ప్రకటనలు ఇదే షో లో చాలానే జరిగాయి, అదే విధంగా ప్రాంక్స్ కూడా జరిగాయి. ఎక్కువ శాతం ప్రాంక్స్ జరగడం తో ఇప్పుడు ఇది కూడా ప్రాంక్ అని అనుకుంటున్నారు నెటిజెన్స్.
అయితే 200 వ ఎపిసోడ్ కాబట్టి, కచ్చితంగా నిజమే అయ్యుంటుంది అని అంటున్నారు మరికొందరు. రీసెంట్ గా హరి ‘పొదరిల్లు’ సీరియల్ హీరోయిన్ కృత్తిక తో ఒక లవ్ ట్రాక్ నడుపుతున్న సంగతి తెలిసిందే. ఇది కేవలం షో కోసం చేస్తున్న ట్రాక్ అని అందరికీ స్పష్టంగా అర్థం అవుతోంది. కానీ పొరపాటున ఆమెనే హరి కాబోయే భార్య అయితే ఆడియన్స్ రియాక్షన్ ఏంటి? అంటూ ఈ ప్రోమో క్రింద నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. చూడాలి మరి ఈ ఆదివారం ఏమి జరగబోతుంది అనేది. ఇకపోతే ఈ లేటెస్ట్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.