spot_img
Homeహెల్త్‌Milk Adulteration Test: మీరు వాడే పాలు స్వఛ్చమైనవేనా.. ఎలా గుర్తించాలంటే?

Milk Adulteration Test: మీరు వాడే పాలు స్వఛ్చమైనవేనా.. ఎలా గుర్తించాలంటే?

Milk Adulteration Test: How to Check Adulteration in Milk Milk Adulteration Test: దేశంలో పాల వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. అయితే దేశంలోని పలు ప్రాంతాల ప్రజలు కల్తీ పాలు తాగి అనారోగ్యానికి గురవుతున్నారు. పాలలో నీళ్లు కలుతారనే విషయం అందరికీ తెలిసిందే. అయితే కొంతమంది యూరియాతో పాలను తయారు చేస్తున్నారు. పిల్లలు యూరియాతో తయారు చేసిన పాలను తాగితే పిల్లల పెరుగుదలపై ప్రభావం పడుతుంది. యూరియాతో తయారు చేసిన పాల వల్ల ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి.

అయితే కొన్ని సింపుల్ చిట్కాల ద్వారా పాలలో కల్తీ జరిగిందో లేదో సులభంగా తెలుసుకోవడం సాధ్యమవుతుంది. ఏటవాలుగా ఉండే ప్రాంతంపై పాలచుక్కను వేస్తే నీళ్లు కలిపిన పాలచుక్క వేగంగా జారుతూ కిందికి వస్తుంది. అలా కాకుండా స్వచ్చమైన పాలు అయితే మాత్రం నెమ్మదిగా కిందికి వస్తుంది. స్టార్చ్ లాడిన్ ద్రావణంలో పాలు వేసిన తర్వాత ఆ పాలు నీలం రంగులోకి మారితే పాలలో పిండి కలిపినట్లుగా భావించాలి.

పాలను నీటిలో కలిపిన సమయంలో నురుగు ఎక్కువగా వస్తే డిజర్జెంట్ పౌడర్ కలిపినట్లుగా భావించాలి. యూరియా స్ట్రిప్స్ తో పాలలో కృత్రిమ ప్రోటీన్ ఉందో లేదో తెలుసుకునే అవకాశం ఉంటుంది. కల్తీ పాలు తాగడం వల్ల గుండె, కిడ్నీ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. కల్తీ పాలలోని సోడియం శరీరంపై ప్రభావం చూపించే అవకాశాలు ఉంటాయి. సింథటిక్ పాలను వేడి చేస్తే పాలు పసుపు రంగులోకి మారతాయి.

పాలను టెస్ట్ ట్యూబ్ లో వేసి కొంచెం పసుపు వేసి పాలకు ఎర్ర లిట్మస్ కాగితాన్ని జోడిస్తే కాగితం రంగు మారితే మాత్రం యూరియా కలిపారని గుర్తుంచుకోవాలి. ఈ విధంగా పాలలో కల్తీ జరిగిందో లేదో చెక్ చేసుకుంటే మంచిది.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

Shreyas Iyer Captaincy

Shreyas Iyer Captaincy: మొదటి పరీక్షలోనే ఫెయిల్.. అయ్యర్ కు ఎన్ని ఎలివేషన్లు ఇచ్చినా దండగే

Shreyas Iyer Captaincy: కాపురం చేసే కళ నిశ్చయ తాంబూలాల సమయంలోనే తెలుస్తుందని పెద్దలు అంటుంటారు. ఈ సామెతను ఒకవేళ క్రికెట్ క్రీడకు అన్వయిస్తే ఒక కెప్టెన్ సామర్థ్యం తన తొలి...
Diamond Rain

Diamond Rain: వజ్రాల వాన కురుస్తోంది.. ఏరుకోవడానికి మీరు సిద్ధమా

Diamond Rain: ఈ భూమి మీద అత్యంత ఖరీదైన లోహాలు కొన్ని ప్రాంతాలలో మాత్రమే ఉన్నాయి. అవి కూడా పరిమితంగా ఉన్నాయి. కాకపోతే మనుషులకు అరుదైన లోహాల మీద విపరీతమైన ఆసక్తి....
Today 23 July 2026 Horoscope

Today 23 July 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారు జాగ్రత్త.. జీవితంలో ఊహించని మార్పులు..

Today 23 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువారం ద్వాదశ రాశులపై విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు శుక్ల యోగం ఏర్పడడం వల్ల కొన్ని రాశుల వారికి అనుకోకుండా...
INS Mahendragiri

INS Malvan : సైన్యం చేతికి మరో యుద్ధ నౌక… శత్రు సబ్‌మెరైన్లకు ఇక చుక్కలే!

INS Malvan భారత సైన్యం చేతికి మరో యుద్ధ నౌక చేరింది. ఇటీవలే విశాపట్నంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఒక నౌకను నేవీకి అప్పగించారు. తాజాగా భారత నేవీ తన సబ్‌మెరైన్‌ వ్యతిరేక...

Telangana ACB : కిలోల కొద్ది బంగారం.. అంతకుమించి నోట్ల కట్టలు.. ఈ అధికారి అవినీతిలో అనకొండ

Telangana ACB : రెండు కిలోల బంగారం.. 52 లక్షల నగదు.. మూడు కార్లు.. 30 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు.. 20 అత్యంత ఖరీదైన విదేశీ మద్యం సీసాలు.. అంతేకాదు ఆయన...
Oktelugu Epaper