Homeజాతీయ వార్తలుNarendra Modi: ఇన్ స్టా లో మోడీ మ్యాజిక్.. మరో కొత్త వీడియో

Narendra Modi: ఇన్ స్టా లో మోడీ మ్యాజిక్.. మరో కొత్త వీడియో

Narendra Modi: ఒక వయసుకు వచ్చిన తర్వాత శరీరానికి విశ్రాంతి అవసరం. వయసు పై పడుతుంటే ఒకప్పటి మాదిరిగా పనిచేయడం సాధ్యం కాదు. ఉత్సాహంగా ఉండడం సాధ్యం కాదు. ఉల్లాసంగా ఉండడం కూడా సాధ్యం కాదు. కానీ నరేంద్ర మోడీ విషయంలో మాత్రం ఇందుకు ప్రతిదీ వ్యతిరేకంగా జరుగుతూ ఉంటుంది. నవరాత్రుల సమయంలో నరేంద్ర మోడీ అత్యంత నిష్టగా ఉపవాసం ఉంటారు. కేవలం నిమ్మకాయ నీళ్లు మాత్రమే తాగుతారు. దుర్గాదేవి ఉపాసనలో ఉంటారు. అమ్మవారికి పూజలు చేస్తూ […]

Narendra Modi: ఒక వయసుకు వచ్చిన తర్వాత శరీరానికి విశ్రాంతి అవసరం. వయసు పై పడుతుంటే ఒకప్పటి మాదిరిగా పనిచేయడం సాధ్యం కాదు. ఉత్సాహంగా ఉండడం సాధ్యం కాదు. ఉల్లాసంగా ఉండడం కూడా సాధ్యం కాదు. కానీ నరేంద్ర మోడీ విషయంలో మాత్రం ఇందుకు ప్రతిదీ వ్యతిరేకంగా జరుగుతూ ఉంటుంది.

నవరాత్రుల సమయంలో నరేంద్ర మోడీ అత్యంత నిష్టగా ఉపవాసం ఉంటారు. కేవలం నిమ్మకాయ నీళ్లు మాత్రమే తాగుతారు. దుర్గాదేవి ఉపాసనలో ఉంటారు. అమ్మవారికి పూజలు చేస్తూ ఉంటారు. మిగతా సమయంలో కూడా ఆయన పూర్తిగా శాఖాహారం మాత్రమే తీసుకుంటారు. నరేంద్ర మోడీ జీవితంలో ఇంతవరకు అనారోగ్యానికి గురికా లేదు అంటే ఆయన ఆరోగ్య శైలి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆయన మద్యం తాగరు. మాంసం ముట్టరు. ధూమపానం జోలికి వెళ్ళరు. యోగా చేస్తారు. సాత్వికమైన ఆహారాన్ని తీసుకుంటారు. అనవసరమైన నూనె పదార్థాల జోలికి వెళ్లరు. కొన్ని సందర్భాలలో కటిక నేల మీద మాత్రమే పడుకుంటారు.

ఇలాంటి జీవనశైలి అనుసరించడం వల్లే నరేంద్ర మోడీ ఇంతటి ఆరోగ్యంగా ఉన్నారు. ఏడుపదులకు పైగా వయసులో కూడా యువకులతో సమానంగా వ్యవహరించగలుగుతున్నారు. ప్రధానమంత్రిగా నిర్విరామంగా పనిచేయగలరు. నరేంద్ర మోడీ ఇటీవల కాలంలో ఢిల్లీలో జరిగిన నీట్ ఆందోళనల నేపథ్యంలో.. యువతరానికి దగ్గర కావడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇన్ స్టా గ్రామ్ లో వీడియోలు పెడుతున్నారు. అప్పట్లో వరుసగా వీడియోలు పోస్ట్ చేసి సోషల్ మీడియాను షేక్ చేశారు. ఇప్పుడు తాజాగా మరో వీడియోను ఆయన పోస్ట్ చేశారు. ఈసారి కూర్చొని కాకుండా నడుచుకుంటూ మాట్లాడారు. నేడు నేషనల్ హ్యాండ్లూమ్ డే సందర్భంగా చేనేత వస్త్రాలను ప్రజలు ప్రోత్సహించాలని సూచించారు. గెట్ రెడీ విత్ మీ వీడియోను షేర్ చేయాలంటూ జెన్ జెడ్ లాంగ్వేజ్ వాడారు.

కొన్ని రకాల చేనేత కండువాలను తన ముందు ఉన్న టేబుల్ మీద ఉంచి.. అందులో కాషాయం రంగు కండువాను తన భుజాల మీద వేసుకున్నారు. తద్వారా తన పార్టీ అంటే తనకు ఎంత ఇష్టమో.. కాషాయం అంటే ఎంత ప్రేమ నిరూపించారు. జనరేషన్ జెడ్ గెట్ రెడీ విత్ మీ కోడ్ ను పలికి నరేంద్ర మోడీ తనలో ఉన్న యువకుడిని ప్రపంచానికి చూపించారు. అంతేకాదు ఈ తరం పిల్లలకు దగ్గర కావడానికి ఆయన ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇప్పటికే నరేంద్ర మోడీ పోస్ట్ చేసిన వీడియో మిలియన్లలో వ్యూస్ సొంతం చేసుకుంది. ఒకరకంగా ట్రెండింగ్ లో దూసుకుపోతోంది.

 

View this post on Instagram

 

A post shared by Narendra Modi (@narendramodi)

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper