Big Boss Agnipariksha 2: కోట్లాది మంది ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న ‘బిగ్ బాస్ 10’ మొదలు అవ్వడానికి పట్టుమని 20 రోజులు కూడా లేదు. అయితే గత సీజన్ లో లాగానే , ఈ సీజన్ లో కూడా ‘అగ్నిపరీక్ష’ అనే షో ద్వారా సామాన్యులను బిగ్ బాస్ హౌస్ లోకి పంపబోతున్నారు. అందుకు సంబంధించిన ఆడిషన్ ఎపిసోడ్స్ ప్రతీ రోజు స్టార్ మా ఛానల్ లో రాత్రి 10 గంటలకు ప్రసారం అవుతోంది. జియో హాట్ స్టార్ లో అయితే అర్థ రాత్రి 12 గంటలకు కొత్త ఎపిసోడ్ అందుబాటులోకి వస్తుంది. అయితే ఈరోజుటి ఎపిసోడ్ లో అనేక సంఘటనలు చోటు చేసుకున్నాయి. వాటిల్లో మిస్ అపూర్వ అనే కంటెస్టెంట్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాము. ఒక్క మాటలో చెప్పాలంటే ఈమె దెబ్బకు జడ్జీలు గడగడలాడిపోయారు అనే చెప్పాలి.
ఈమె ఎంట్రీ నే వేరే లెవెల్ లో ఉన్నింది. యాంకర్ శ్రీముఖి ని సైతం తన మాటకారి తనం తో ఆశ్చర్యపోయేలా చేసింది. ముగ్గురు జడ్జీలను ఆరంభం లోనే ఆకర్షించింది. ఈమె ఎంట్రీ ఇచ్చి నాలుగైదు మాటలు మాట్లాడగానే నవదీప్ గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చేశాడు . ఈమె స్పీడ్ చూసి , మిగిలిన ఇద్దరు జడ్జీలు కూడా గ్రీన్ ఫ్లాగ్స్ ఇచ్చి చివరి రౌండ్ కి పంపిస్తారని అంతా అనుకున్నారు. కానీ మధ్యలో ఈమె అభిజిత్ గేమ్ నాకు నచ్చలేదు అని మాట్లాడినప్పటి నుండి ఇరకాటం లో పడింది. బిందు మాధవి , అభిజిత్ ఇద్దరూ కూడా ఆడేసుకున్నారు. ముఖ్యంగా అభిజిత్ గేమ్ అంటే నాకు ఇష్టం లేదు అని చెప్పినందుకు అభిజిత్ బాగా హర్ట్ అయ్యినట్టు అనిపించింది. అంతే కాకుండా అప్పట్లో అభిజిత్ అఖిల్ సార్థక్ పై చేసిన కామెంట్స్ ప్రస్తావన కూడా తీసుకొచ్చి , అది నాకు నచ్చలేదు అంటూ చెప్పుకొచ్చింది.
View this post on Instagram
దీనికి అభిజిత్ వివరణ కూడా ఇచ్చాడు. ఆయన ఇచ్చిన వివరణకు అపూర్వ సరైన సమాధానం చెప్పలేకపోయింది. మీరు కరెక్ట్ అయ్యుండొచ్చు , కానీ అభిప్రాయాన్ని మాత్రమే ఇక్కడ నేను పెట్టాను , బహుశా నేను తప్పు అయ్యుండొచ్చు అని క్లారిటీ ఇచ్చినప్పటికీ కూడా అభిజిత్ సంతృప్తి చెందలేదు. ఈయన రెడ్ ఫ్లాగ్ ఇచ్చాడు, బిందు మాధవి కూడా రెడ్ ఫ్లాగ్ ఇచ్చింది. దీంతో ఇప్పుడు ఈమె హోల్డ్ లో పడింది , తదుపరి రౌండ్స్ లో గెలిచి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తుందో లేదో చూడాలి. ‘అగ్ని పరీక్ష’ మొదటి సీజన్ లో దివ్య నిఖిత కూడా అభిజిత్ గురించి ఇలాంటి కామెంట్స్ చేసింది, కానీ ఆమెకు అభిజిత్ గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చాడు. అలాంటి అభిజిత్ , ఈమెకు రెడ్ ఫ్లాగ్స్ ఇవ్వడం పై సోషల్ మీడియా లో విమర్శలు వినిపిస్తున్నాయి. ఈమె ఆడిషన్ కి సంబంధించిన ఒక వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.