Big Boss Agnipariksha 2: ‘అగ్ని పరీక్ష 2’ షో రీసెంట్ గానే స్టార్ మా , జియో హాట్ స్టార్ లలో చాలా గ్రాండ్ గా మొదలైంది. ఇప్పటి వరకు 4 ఎపిసోడ్స్ ని పూర్తి చేసుకున్నాయి. ఈ నాలుగు ఎపిసోడ్స్ గురించి సోషల్ మీడియా లో చర్చ చాలా గట్టిగానే జరుగుతోంది. ఇప్పటి వరకు ఈ షో ని అనుసరించని వాళ్ళు కూడా, సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న క్లిప్స్ ని చూసి రియాక్షన్స్ ఇస్తున్నారు. ఆ రేంజ్ లో వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ లాగా మారిపోయింది ఈ ‘అగ్నిపరీక్ష 2’ షో. ఈ షో నే ఇలా ఉందంటే , ఇక ‘బిగ్ బాస్ 10’ ఏ రేంజ్ లో ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు. ఈ షో ఆడిషన్స్ లో పాల్గొన్న ప్రతీ కంటెస్టెంట్ పాపం తమకు తోచిందేదో చేసి , బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు తెగ కష్టపడుతున్నారు.
View this post on Instagram
నేటి ఎపిసోడ్ లో భాగీ తుళ్లూరు అనే అమ్మాయి జడ్జీలను ప్రత్యేకంగా ఆకర్షించింది. అసలు ఆమె చురుకుదనం , టాలెంట్ ని చూసి , మూడు గ్రీన్ ఫ్లాగ్స్ ఇచ్చి చివరి రౌండ్ కి పంపేయొచ్చు. ఇప్పటి వరకు ఆడిషన్స్ ఇచ్చిన కంటెస్టెంట్స్ చరణ్ తర్వాత , అంతటి టాలెంటెడ్ కంటెస్టెంట్ గా కనిపించింది భాగీ తుళ్లూరు మాత్రమే. ఈమె నెల్లూరు జిల్లాలోని కావలి కి చెందిన అమ్మాయి. పెళ్లి కూడా అయిపోయింది. ఆడిషన్స్ లో తన భర్త తో ఈమెకు ఎలా ప్రేమ ఏర్పడింది?, అది పెళ్లి వరకు ఎలా దారి తీసిందో చెప్పుకొచ్చింది. అది చాలా ఎంటర్టైన్ గా అనిపించింది. అదే విధంగా నవదీప్ , శ్రీముఖి లతో కలిసి ఈమె చేసిన యాక్ట్ వేరే లెవెల్ లో ఉన్నింది.
ఈమె పెర్ఫార్మన్స్ దెబ్బకు నవదీప్ కూడా కాసేపు బ్లాంక్ అయిపోయాడు అంటేనే అర్థం చేసుకోవచ్చు , ఏ రేంజ్ లో చేసింది అనేది. పైగా ఈమె భర్త సాఫ్ట్ వేర్ ఉద్యోగి, ఈమె కూడా గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉండేదట. కానీ ఇప్పుడు సంవత్సరం నుండి ఖాళీగా ఉంది. ఈమె పలికే నెల్లూరు యాస వేరే లెవెల్ అనే చెప్పాలి. ఒకవేళ బిగ్ బాస్ హౌస్ లోకి ఈమె ఎంట్రీ ఇస్తే తిరుగులేని ఎంటర్టైన్మెంట్ దక్కుతుంది అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. గొడవలు కూడా బాగానే పెట్టుకునేలా ఉంది. అయితే టాస్కులు ఎలా ఆడుద్దో తెలియదు కాబట్టి ఈమెని నేరుగా టాప్ 15 కి సెలెక్ట్ చేయలేదు జడ్జీలు. కానీ ఈమెకు ఆడిషన్స్ తర్వాత నిర్వహించిన టాస్కుల్లో , తన జుట్టుని కత్తిరించుకొని టాప్ 15 లోకి వెళ్ళిపోయింది. మరి ఈమె బిగ్ బాస్ హౌస్ లోకి వస్తుందా లేదా అనేది చూడాలి.