Dhruv Vikram : గత కొద్దిరోజుల నుండి సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో ట్రెండ్ అవుతున్న జంట అనుపమ పరమేశ్వరన్, ధృవ్ విక్రమ్. ఏ జంట అయినా పెళ్లి న్యూస్ ద్వారా ఫేమస్ అవుతారు , కానీ వీళ్ళు మాత్రం బ్రేకప్ న్యూస్ తో వైరల్ అవుతున్నారు. మేమిద్దరం ప్రేమలో ఉండేవాళ్ళం అని వీళ్లిప్పుడు అధికారికంగా ప్రకటించలేదు , కానీ పరోక్షంగా అనుపమ పరమేశ్వరన్ అయితే రీసెంట్ గా తన ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ తో , ఇంటర్వ్యూస్ తో క్లారిటీ ఇచ్చేసింది. రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు పంజరం లో బంధించబడిన దాని లాగా నా జీవితం ఉండేది అంటూ ఆమె మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో సంచలనం గా మారాయి. అయితే కేవలం నీ వెర్షన్ గురించి మాత్రమే చెప్తున్నావు , ఇద్దరి వైపు నుండి వాదనలు విన్న తర్వాత ఎవరు తప్పు చేశారు అనేది ఒక క్లారిటీ వస్తుంది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేశారు.
ప్రైవేట్ రిలేషన్ షిప్ గురించి , ఇలా మాజీ ప్రియుడి పై ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు , నీ వ్యక్తిగతంగా డీల్ చేసుకుంటే బెటర్ అంటూ అనుపమ ని తప్పుబడుతూ అత్యధిక శాతం మంది నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇది కాసేపు పక్కన పెడితే ఈ అంశంపై రీసెంట్ గా ధృవ్ విక్రమ్ కూడా పరోక్షంగా స్పందించాడు. ఆయన మాట్లాడుతూ ‘నిజం చెప్పాలంటే , నాపై ఈ ప్రచారం అసలు ఎలాంటి ప్రభావం చూపలేదు అని నేను చెప్పలేను. కానీ ఇలాంటి సమయంలో మనల్ని మనం ఎక్కువ అర్థం చేసుకోవడం తో పాటు, మనపై మనం బలమైన ఆత్మవిశ్వాసం , నమ్మకం ఏర్పరచుకోవడం చాలా ముఖ్యం. మనమేమిటో, దేనికోసం నిలబడి పోరాడుతున్నామో గ్రహించాలి. మనకు నచ్చే మనుషుల్ని , మనం ప్రాణంగా భావించే ప్రతీ ముఖ్యమైన విషయాన్నీ కాపాడుకోవాలి. మనం నిజాయితీగా ఉన్నప్పుడు , విమర్శలు ఏమి చెయ్యలేవు’ అంటూ చెప్పుకొచ్చాడు ధృవ్ విక్రమ్.
ఇక సోషల్ మీడియా వాడకం గురించి మాట్లాడుతూ ‘నేను సినిమా ప్రొమోషన్స్ సమయం లో తప్ప, మిగిలిన సమయాల్లో సోషల్ మీడియా ని పెద్దగా ఉపయోగించను . నాకు వీడియోలను ఎడిటింగ్ చేయడం అంటే చాలా ఇష్టం. ఖాళీ సమయం లో అవే ఎక్కువగా చేస్తుంటాను , వాటిని సోషల్ మీడియా లో అప్లోడ్ చేయను కానీ , నాకు ఇష్టమైన పని కాబట్టి చేస్తుంటాను’ అంటూ చెప్పుకొచ్చాడు ధృవ్ విక్రమ్. ఆయన మాట్లాడిన ఈ మాటలన్నీ అనుపమ ని ఉద్దేశించి మాట్లాడినవే అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.