Illegal affair: అక్రమ సంబంధాలు అలజడి సృష్టిస్తున్నాయి. నూరేళ్లు తోడుంటామని చెప్పిన వారే అడ్డదారుల్లో నడుస్తున్నారు. పెళ్లి నాటి ప్రమాణాలు తుంగలో తొక్కుతున్నారు. అర్థేశా కామోశా మోక్షాశా అనే మంత్రాలను మరిచిపోతున్నారు. ఫలితంగా వేరొకరితో గుట్టుగా అక్రమ సంబంధాలు కొనసాగిస్తూ కట్టుకున్న వారికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఇదేమని అడిగితే ససేమిరా వినడం లేదు. దీంతో జీవితభాగస్వామి జీవితంపై విరక్తితో తనువు చాలించాలని భావిస్తూ ప్రాణాలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నో ఘటనలు విస్తుగొలుపుతున్నాయి.
తాజాగా కృష్ణా జిల్లా ఏ.కొండూరు మండలం కేశ్యాతండాలో ఓ భార్య కానిస్టేబుల్ తో అక్రమ సంబంధం కొనసాగిస్తోంది. దీంతో కట్టుకున్న వాడు ఇది పద్ధతి కాదని మార్చుకోవాలని చెప్పినా ఆమెలో మార్పు కనిపించలేదు. దీంతో అతడు జీవితంపై విరక్తితో ఆత్మహత్య చేసుకోవాని భావించాడు. ఎదుటి వ్యక్తి కానిస్టేబుల్ కావడంతో ఏమి చేయలేక తానే జీవితాన్ని చాలించాలని అనుకున్నాడు.
మనస్తాపానికి గురైన భర్త పురుగుల మందు తీసుకుని ఓ నిర్మాణుష్య ప్రాంతానికి వెళ్లాడు. తన భార్య నిర్వాకంతో ఇక జీవించలేనని భావించి అక్కడ ఓ సెల్ఫీ వీడియో తీసుకుంటూ పురుగుల మందు తాగాడు. అక్కడే ఉన్న స్థానికులు గమనించి అతడిని ఆస్పత్రికి తరలించారు. అయితే అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
దీంతో కేశ్యాతండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. జీవిత భాగస్వామి నిర్వాకంతో విసిగిపోయిన భర్త తన చావుకు కారణం తన భార్యే అని చెబుతూ రోదిస్తూ వీడియో తీసుకున్నట్లు తెలుస్తోంది. మగాడికి తోడుగా ఉండాల్సిన ఆడదే దారి తప్పడం అతడు తట్టుకోలేకపోయి పురుగుల మందు తాగినట్లు చెబుతున్నారు. దీంతో అతడు చావుబతుకుల మధ్య పోరాడుతున్నట్లు వైద్యులు ప్రకటించారు.
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Read MoreWeb Title: Man attempts to suicide with drink pesticides over his wife continue illegal affair
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com