Allu Arjun: సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎలివేట్ చేసుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తుంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆర్య సినిమాతో స్టైలిష్ స్టార్ గా అవతరించిన అల్లు అర్జున్ సైతం ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా మారడమే కాకుండా ఐకాన్ స్టార్ గా వెలుగొందుతున్నాడు. ఇప్పటివరకు పాన్ ఇండియాలో ఎవరికీ దక్కనటువంటి క్రేజ్ ను సంపాదించుకోవడం నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి…ఇక ఇలాంటి క్రమంలోనే అల్లు అర్జున్ ఇండస్ట్రీకి రావాలనుకున్న కొత్తలో మెగాస్టార్ చిరంజీవి అతన్ని ప్రోత్సహించాడు. చిరంజీవి హీరోగా చేసిన ‘డాడీ’ సినిమాలో అల్లు అర్జున్ కి ఒక కీలక పాత్రలో నటించాడు…
అప్పట్లో అల్లు అర్జున్ చాలా బాగా డ్యాన్స్ వేసేవాడు. అందువల్ల డ్యాన్సర్ గా అల్లు అర్జున్ ను తెర మీద ఆవిష్కరించాలనే ప్రయత్నం కూడా చిరంజీవిదే కావడం విశేషం…డాడీ సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు అల్లు అర్జున్ కొన్ని స్టెప్స్ ని పెర్ఫెక్ట్ గా వేయలేకపోయారట. దాంతో చిరంజీవి దగ్గరుండి మరి అల్లు అర్జున్ కి ఆ స్టెప్పులు నేర్పించారట.
చిరంజీవి అల్లు అర్జున్ ను మందలిస్తూ తలమీద ఒక దెబ్బ కొట్టి ఆ స్టెప్ ఎలా వేయాలి అనేది కూడా తనే దగ్గరుండి నేర్పించారట. నిజానికి అల్లు అర్జున్ అప్పట్లో చాలా కోతి పనులు చేస్తూ ఉండేవాడు. డ్యాన్స్ చేసేటప్పుడు కూడా అలాంటి కోతి పనులు చేయడం వల్ల చిరంజీవి తన తల మీద రెండు మొట్టికాయలు వేసినట్టుగా అప్పట్లో కొన్ని వార్తలైతే వచ్చాయి.
ఇక మొత్తానికైతే చిరంజీవి చేతుల మీదుగా ఇంట్రడ్యూస్ అయిన అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో ముందుకు దూసుకెళ్లడం అనేది నిజంగా చాలా గర్వించదగ్గ విషయమనే చెప్పాలి…ఈ రోజు అల్లు అర్జున్ చేసే సినిమాను చూడటానికి యావత్ ఇండియన్ సినిమా ప్రజానీకం ఆసక్తిగా ఉన్నారంటే ఆయన ప్రేక్షకుల్లో ఎలాంటి గుర్తింపును సంపాదించుకున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు…