Pakistan and India : వార్ జెట్స్.. ఇతర వాటిల్లో అశేషమైన సాంకేతిక పరిజ్ఞానం.. అధునాతన ఆయుధాలు ఉన్న భారత్.. పాకిస్తాన్ ను గట్టిగానే దెబ్బ కొడుతోంది. తీవ్రాతి తీవ్రంగా విరుచుకుపడుతోంది. పాకిస్తాన్ చేస్తున్న దాడులకు భారత్ అత్యంత బలంగా సమాధానం చెబుతోంది. కనివిని ఎరగని స్థాయిలో ప్రతిదాడులు చేస్తోంది. ఈసారి ఏకంగా పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ ను భారత్ టార్గెట్ చేసింది. ఇస్లామాబాద్ సహా తొమ్మిది నగరాలపై ఏకకాలంలో దాడులు ప్రారంభించింది.. ఈ దాడులకు డ్రోన్లను ఉపయోగించుకుంటున్నది. శత్రు దేశానికి అత్యంత కీలకమైన ఎయిర్ బోర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టం ను భారత్ ఫినిష్ చేసింది.. ఎస్ 400, ఎల్ 70, జెడ్ ఎస్ యు 23, ఇక ఎయిర్ డిఫెన్స్ ను భారత్ యాక్టివేట్ చేసింది. ఇక ఇప్పటికే మన దేశంలోకి ప్రవేశించిన పాకిస్తాన్ దేశానికి చెందిన 8 క్షిపణులను, మూడు ఫైటర్ జెట్ విమానాలను భారత్ నేల కూల్చింది. ఒక రకంగా ఇది శత్రుదేశం పాకిస్తాన్ కు చావు దెబ్బ.
Also Read : భారత్, పాక్ ఉప్పూ నిప్పూ లాగ ఉంటాయి గాని.. కలిసి పనిచేస్తే ఇలాంటి ఫలితాలే వస్తాయి..
అది లేకపోతే..
ఎయిర్ బోర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టం అనేది పాకిస్తాన్ సైన్యానికి గుండెకాయ లాంటిది. ఇది ప్రమాదాలను ముందస్తుగానే గుర్తించి హెచ్చరిస్తుంది. అంతేకాదు దాయాది దేశం.. తను ఇతర దేశాలపై ప్రయోగించే క్షిపణుల దిశ, దశను ఎప్పటికప్పుడు వెల్లడిస్తుంది. అయితే ఈ సిస్టం మొత్తం పూర్తిగా ధ్వంసం కావడంతో.. పాకిస్తాన్ కు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. దీంతో తర్వాత మిసైల్స్ ఎలా ప్రయోగించాలనేది ఆదేశానికి అంతుపట్టకుండా ఉంది. ఏకంగా రాజధాని నగరాన్ని టార్గెట్ చేయడంతో.. పాకిస్తాన్ కు ఏం చేయాలో పాలుపోవడం లేదు.. ప్రతిదాడులను నిలిపివేయాలని ఆదేశాలు వచ్చేసాయి.. లేకపోతే తదుపరి పరిణామాలు తీవ్రంగా ఉంటాయని సంకేతాలు కూడా దాయాది దేశానికి అందాయి.. అవి ఎక్కడి నుంచి వచ్చాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. మరోవైపు పాకిస్తాన్ చేస్తున్న దాడులను ఎప్పటికప్పుడు భారత సైన్యం తిప్పికొడుతోంది. అత్యంత ఆధునికమైన ఆయుధాలతో.. మనదేశంలోకి పాకిస్తాన్ క్షిపణులు ప్రవేశించకుండా గగన తలంలోనే అడ్డుకుంటున్నది. మనదేశంలో నష్టం జరగకుండా చూసుకుంటున్నది.
సరిహద్దుల్లో పాకిస్తాన్ వికృత చేష్టలకు పాల్పడే ప్రమాదం ఉన్న నేపథ్యంలో.. భారత సైన్యం అక్కడ కట్టదిట్టంగా భద్రతను ఏర్పాటు చేసింది. అత్యవసరం ఉంటే తప్ప ప్రజలు ఎవరు బయటకు రావద్దని సైన్యం సూచించింది. ఇప్పటికే పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న రాష్ట్రాలలో హెచ్చరికలు జారీ చేసింది. స్థానిక పోలీసుల సహాయంతో భారత బలగాలు నిత్యం ఆ ప్రాంతంలో పహారా కాస్తున్నాయి. ఎప్పటికప్పుడు దాయాది దేశం నుంచి అక్రమ చొరబాట్లు జరగకుండా చూసుకుంటున్నాయి. అందువల్లే పాకిస్తాన్ క్షిపణులతో మన దేశంపై దాడి చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అయితే వీటిని కూడా ఎప్పటికప్పుడు మన సైన్యం అత్యంత సమర్థవంతంగా తిప్పి కొడుతున్నది.
Also Read : నేను చెబితే వినడానికి మోదీ నా అత్త కొడుకు కాదు.. ఒరేయ్ నువ్వు ఎంపీవి రా బాబూ!