Mumbai Real Estate: ఎవడి తిండి వాడి ఇష్టం. ఒకడు ఏం తినాలో మనం డిసైడ్ చేయకూడదు. ఎందుకంటే తిండి అనేది జన్మ హక్కు. బతకాలి అంటే తినాలి. లేకపోతే చచ్చి ఊరుకుంటారు. ఇది తెలిసి కూడా ఇతరుల తిండి మీద పెత్తనం సాగించే వాళ్లను ఏమనాలో.. ఆ పదం ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో కూడా లేదు.
పెద్ద పెద్ద నగరాలలో గృహాలను అద్దెకిస్తున్నప్పుడు యజమానులు రకరకాల కండిషన్లు పెడుతుంటారు. గోడలకు మేకులు కొట్టకూడదని.. కరెంటు లైట్లు తెల్లవారులు వేసి ఉండకూడదని.. ముఖ్యంగా బంధువులు పరిమిత సంఖ్యలోని రావాలని.. ఇలా రకరకాల షరతులు పెడుతుంటారు. ముందుగానే నాలుగు నెలల అద్దె తీసుకుంటారు. కొందరైతే ఏడాది అద్దె తీసుకుంటారు.. దానిని అడ్వాన్స్ అని చెబుతుంటారు. ఇలా గృహాలను అద్దెకిచ్చే యజమానులు చిత్రవిచిత్రమైన షరతులు పెడుతూ.. చుక్కలు చూపిస్తుంటారు.
మహానగరాలలో గృహాలు అద్దెకు దొరకడం చాలా కష్టం. పైగా తాత్కాలిక షెల్టర్ లేకపోతే నగరాలలో ఉండడం చాలా ఇబ్బంది. అందువల్లే గృహ యజమానులు పెట్టే కండిషన్లకు చాలామంది ఒప్పుకుంటారు. తప్పదు అనుకొని వారు చెప్పినట్టుగా నడుచుకుంటారు.. కానీ ముంబైలోని తార్ దేవ్ ప్రాంతంలో ఓ రియల్టర్ చేసిన పని ఇప్పుడు ఆశ్చర్యకరంగా మారింది. పైగా మనుషులు ఇలా కూడా ఉంటారా అనేలా చేస్తోంది. ఇంతకీ అతడు చేసిన పని.. పెట్టిన షరతులు.. ఏకంగా జాతీయ మీడియాలో ప్రధానంగా ప్రసారం కావడం విశేషం.
ముంబై నగరంలో గృహాలకు ఏ స్థాయిలో డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశం మొత్తం రియల్ ఎస్టేట్ పడక వేసినప్పటికీ.. ఇక్కడ మాత్రం పచ్చగా వర్ధిల్లుతూ ఉంటుంది. ముంబైలోని తార్ దేవ్ ప్రాంతంలో ఓ రియల్టర్ బహుళ అంతస్తుల భవనాన్ని నిర్మించాడు. ఇందులో ఒక్కొక్క ప్లాట్ ధర 6.3 కోట్లుగా నిర్ణయించాడు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ కేవలం శాఖాహారం తినే వాళ్లకు మాత్రమే ప్లాట్ అమ్ముతానంటూ అతడు కండిషన్ పెట్టాడు. ఇది విన్నవాళ్లంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఎవడి తిండి వాడి ఇష్టం. వాడు ఏం తింటాడో నువ్వు ఎలా డిసైడ్ చేస్తావ్.. అంటూ అతడికి రివర్స్ కౌంటర్ ఇవ్వడం మొదలుపెట్టారు. అయినప్పటికీ అతడు వెనక్కి తగ్గలేదు. శాఖాహారం తింటేనే ప్లాట్ అమ్ముతాను అంటూ అతడు గట్టిగా తెగేసి చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది..
“ఏ కాలంలో ఉన్నావు నాయనా నువ్వు.. ఎవడు ఏం తింటాడో.. ఎవడు ఏం తినాలో నువ్వు ఎలా డిసైడ్ చేయగలుగుతావు.. ఎవడు తింటి వాడి ఇష్టం. వెజిటేరియన్ తింటే ప్లాట్ అమ్ముతామనడం నీ మూర్ఖత్వానికి పరాకాష్ట. ఇంతకుమించి ఏమి చెప్పేది లేదు. నువ్వు అన్ని కండిషన్లు పెట్టినప్పటికీ కొనడానికి కొంతమంది ముందుకు వస్తున్నారంటే.. ఏం చెప్పాలో అర్థం కావడం లేదు అంటూ” నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ही मुंबई मराठी माणसाची आहे. आगरी-कोळी बांधवांची आहे. महाराष्ट्राच्या कष्टकरी, सर्वसामान्य माणसाची आहे.
आणि मुंबईत कोणी काय खावं, काय खाऊ नये हे ठरवणारे तुम्ही कोण?माणूस मच्छी, मटण किंवा चिकन खातो म्हणून त्याला घर नाकारणं ही फक्त घर देण्याची मनमानी नाही ही उघड सामाजिक भेदभावाची… pic.twitter.com/84k06soddf
— Shubham Karpe | शुभम करपे (@ShubhamKarpe10) August 12, 2026