‘Today horoscope in telugu ‘: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం శుక్రవారం ద్వాదశరాసులపై హస్త నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు శుక్రుడు కలిసి ఒకే రాశిలో ప్రయాణం చేయనున్నారు. దీంతో కొన్ని రాశుల వారికి రాజయోగం పట్టనుంది . మరికొన్ని రాశుల వారు మాత్రం ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈ రాశి వారు ఈరోజు చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మనిషి ప్రశాంతంగా మారుతుంది. సమాజంలో గుర్తింపు వస్తుంది. ఇరువుపరుగు వారితో సంబంధాలు మెరుగుపడతాయి. ఈ రాశి మహిళలు కొన్ని ఒత్తిడి ల నుంచి ఉపశమనం పొందుతారు. 15 కి సంబంధించి శుభవార్తలు వింటారు. వ్యాపారులు లాభాలు పొందుతారు.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : . ఈ రాశి వారు మానసికంగా కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటారు. జీవిత భాగస్వామి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు. ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. వ్యాపారులకు అనుకోకుండా లాభాలు వస్తాయి. కుటుంబ సభ్యులతో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. పిల్లల కెరియర్ పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): . ఈ రాశి వారు తమ జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. కొన్ని విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. అయితే వ్యాపారులు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. కొందరు శత్రువులు అడ్డంకులు సృష్టించే అవకాశం ఉంటుంది. ఇంటికి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేస్తారు. వ్యాపారులు ఒప్పందాలు చేసుకునే సమయంలో తెలివైన ప్రదర్శించాలి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : . ఈ రాశి వారికి గతంలో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. స్నేహితులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. ఆర్థిక లావాదేవీలు పొరపాటు జరగకుండా చూడాలి. సమయాన్ని వృధా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలి. వ్యాపారం కోసం ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. భవిష్యత్తులో లాభాలను తీసుకొస్తాయి.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : . ఈ రాశి వారి వైవాహిక జీవితం కాస్త ఇబ్బందిగా ఉంటుంది. మాటలను అదుపులో ఉంచుకోవడం వల్ల కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. వ్యాపారంలో పురోగతి మందగిస్తుంది. కొత్త పెట్టుబడులు పెడతారు. ఈ సమయంలో పెద్దల సలహా తీసుకోవడం మంచిది. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగులు తోటి వారితో సమయమనం పాటిస్తారు.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు ఏర్పాటు చేసుకునే లక్ష్యాలను పూర్తి చేస్తారు. దీంతో అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. ప్రియమైన వారు కోరితే వస్తువులను కొనుగోలు చేస్తారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆర్థికపరమైన ఇబ్బందులను రాకుండా జాగ్రత్త పడాలి. వ్యాపారులకు లాభాలు ఉంటాయి. అయితే కొన్ని విషయాల్లో ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈరోజు అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఉంటాయి. ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. వ్యాపార విస్తరణ కోసం కొత్త భాగస్వాములను చేర్చుకుంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే రాణించే అవకాశం ఉంది. ఇంటికి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేస్తారు.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఈ రోజు కొన్ని విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కొత్తవారితో ఆర్థిక వ్యవహారాలు జరపకుండా ఉండాలి. ఆస్తిపరంగా సోదరులతో విభేదాలు ఉండే అవకాశం. దుబారా ఖర్చులకు దూరంగా ఉండాలి. ఉద్యోగులు తోటి వారితో వాగ్వాదానికి దిగుతారు. అయితే అధికారుల చేరువతో సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇలాంటి సమయంలో మాటలను అదుపులో ఉంచుకోవాలి.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు ఈరోజు ముఖ్యమైన పత్రాలను జాగ్రత్తగా ఉంచుకోవాలి. వివిధ మార్గాల ద్వారా ఆదాయవరణంలో పొందే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పెట్టుబడులు పెట్టే సమయంలో పెద్దల ఆశీర్వాదం తీసుకోవాలి. దాని గురించి తీసుకున్న రుణాన్ని త్వరగా చెల్లిస్తారు. సమాజంలో గుర్తింపు లభిస్తుంది.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉండలు ఉన్నాయి. వ్యాపారులకు అధికంగా లాభాలు వస్తాయి. అయితే వైవాహిక జీవితంలో కాస్త సమస్యలు ఎదుర్కొంటారు. పెట్టుబడులు పెట్టే సమయంలో ఇతర సలహాలు ఇవ్వడం వల్ల ఇవి లాభాలు ఉంటాయి. మహిళా ఉద్యోగులకు కుటుంబ సభ్యుల నుంచి మద్దతు ఉంటుంది. మీరు ఆర్థికంగా అధిక ప్రయోజనాలు పొందుతారు.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు లాభాలు పొందుతారు. వ్యాపారాన్ని మరింత విస్తరించడం వల్ల అధికంగా లాభాలు పొందుతారు. ఉద్యోగులు లక్ష్యాలను పూర్తి చేయడంతో అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : మీ రాశి వ్యాపారులు ఈరోజు మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. జీవితంలో కొత్త వ్యక్తి పరిచయం కావడంతో వారితో విలువైన సమయానికి కేటాయిస్తారు. ఆదాయాన్ని పెంచుకోవడానికి అనేక మార్గాలు లభిస్తాయి. ఉద్యోగులు అదరపు ఆదాయాన్ని పొందుతారు. కార్యాలయాల్లో వీరు అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు.