India and Pakistan : ఆపరేషన్ సింధూర్ చేపట్టిన తర్వాత భారత్ పై పాకిస్తాన్ ఉగ్రవాదులు ప్రతీకారంతో రగిలిపోతున్నారు. సరిహద్దుల్లో తీవ్రాతి తీవ్రంగా దాడులకు పాల్పడుతున్నారు.. అంతేకాదు ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేయడంతో దాయాది దేశానికి చెందిన సైనికులు పగతో రగిలిపోతున్నారు. వాస్తవానికి తమదేశంలో టెర్రరిస్టుల క్యాంపులు లేవని లేవని మొదట బుకాయించిన దాయాది దేశం… ఇప్పుడు మాత్రం చనిపోయిన ఉగ్రవాదులు మొత్తం తమ సోల్జర్స్ అని చెప్పడం విశేషం. అందుకే భారత్ పై ప్రతిదాడులకు దిగుతోంది. ఇక నియంత్రణ రేఖ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి పాకిస్తాన్ డ్రోన్లు, ఫైటర్ జెట్ విమానాలు, క్షిపణులతో దాడులకు దిగుతోంది. జమ్ము కాశ్మీర్, రాజస్థాన్లోని జై సల్మీర్, బికనీర్, పంజాబ్ రాష్ట్రంలోని అమృత్ సర్, జలంధర్ నగరాలలో అధికారులు ఏకంగా బ్లాక్ అవుట్ ప్రకటించారు. ప్రజలు ఎవరూ బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఇక పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్లను, ఫైటర్ జెట్ విమానాలను భారత సైన్యం నేలమట్టం చేసింది.
Also Read : పాక్ తో ఉద్రిక్తతలు.. ఐపీఎల్ మ్యాచ్ వేదిక మార్పు
అనధికారికంగా యుద్దం మొదలైనట్టే
ఊహించినట్టుగానే పాకిస్తాన్ ప్రతిదాడులకు దిగుతుండడంతో భారత సైన్యం.. వాటిని సమర్థవంతగా తిప్పికొడుతోంది. పాకిస్తాన్ చేస్తున్న దాడులను గగనతలంలోనే పేల్చివేస్తోంది. మనదేశంలోని ప్రముఖ నగరాలను.. ప్రముఖ విమానాశ్రయాలను పాకిస్తాన్ ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారు. వాటిపై దాడులు చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. అయితే ఇంటలిజెన్స్ ద్వారా ఈ వివరాలు తెలుసుకున్న భారత్.. ముందుగానే అప్రబత్తమైంది.. విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేసింది. ప్రజలు బయటికి రాకుండా ఉండాలని సూచించింది. విద్యుత్ దీపాలు.. అన్నింటినీ కట్టేయాలని సూచించింది. ప్రజలు సురక్షితంగా ఉండాలని.. గుంపులు గుంపులుగా ఉండకూడదని సూచించింది. మొత్తంగా చూస్తే భారత్ స్వీయ రక్షణను పాటిస్తోంది. మరోవైపు సరిహద్దుల్లో ఏర్పడిన ఉద్రిక్తతల వల్ల ధర్మశాలలో బుధవారం జరగాల్సిన ఢిల్లీ – పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ రద్దయింది. మొదట్లో వర్షం కురవడంతో మ్యాచ్ కాస్త ఆలస్యంగా మొదలైంది. ఆ తర్వాత ఫ్లడ్లైట్లలో సాంకేతికపరమైన సమస్య ఏర్పడింది. చివరికి సరిహద్దుల్లో ఉద్రిక్తతలు ఏర్పడిన నేపథ్యంలో మ్యాచ్ మొత్తాన్ని రద్దు చేస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. అంతేకాదు రెండు జట్లకు చెరొక పాయింట్ కేటాయిస్తున్నట్టు వెల్లడించారు. ఇక భారత్ – దాయాది దేశం మధ్య అనఫీషియల్ గా వార్ బిగిన్ అయిన నేపథ్యంలో.. దాయాది దేశాన్ని పూర్తిగా భూస్థాపితం చేయాలని.. అక్కడ టెర్రరిజాన్ని అనేది లేకుండా చేయాలని సోషల్ మీడియాలో నెటిజన్లు కోరుతున్నారు. మరోవైపు శత్రుదేశం చేస్తున్న ప్రతీకారమైన దాడులను భారత్ ఎప్పటికప్పుడు తిప్పి కొడుతోంది. ఏమాత్రం నిర్లక్ష్యానికి తావు ఇవ్వకుండా.. దాయాది దేశం వికృత దాడులకు పాల్పడకుండా ఉండడానికి ముందుగానే మన దేశం కట్టడి చేస్తోంది. అన్నిటికి మించి ఆర్మీ అన్ని విధాలుగా ముందుండి.. పై చేయి సాధిస్తోంది.
Also Read : పాకిస్తాన్ ప్రతీకార దాడులకి పాల్పడితే జరిగేదేంటి?
