Homeఎంటర్టైన్మెంట్Nani: హీరో నాని కి కూతురుగా రితికా నాయక్.. ఇదేమి వింత కాంబినేషన్ సామీ..

Nani: హీరో నాని కి కూతురుగా రితికా నాయక్.. ఇదేమి వింత కాంబినేషన్ సామీ..

Nani: కొన్ని కాంబినేషన్స్ వెండితెర పై చూసేందుకు చాలా విచిత్రం గా అనిపిస్తుంటాయి. గతం లో సీనియర్ హీరోల సినిమాల్లో కూతుర్లుగా నటించిన వాళ్ళు , పెద్దయ్యాక అదే సీనియర్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా నటించిన సందర్భాలను చాలానే చూసాము. ఈమధ్య కాలం లో ఇలాంటివి బాగా తగ్గాయి. ఒకవేళ చేసినా ఆడియన్స్ అంగీకరించే పరిస్థితి లో లేరు. ‘సైరా నరసింహా రెడ్డి’ చిత్రం లో చిరంజీవి కి సతీమణి గా నటించిన నయనతార, అదే […]

Nani: కొన్ని కాంబినేషన్స్ వెండితెర పై చూసేందుకు చాలా విచిత్రం గా అనిపిస్తుంటాయి. గతం లో సీనియర్ హీరోల సినిమాల్లో కూతుర్లుగా నటించిన వాళ్ళు , పెద్దయ్యాక అదే సీనియర్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా నటించిన సందర్భాలను చాలానే చూసాము. ఈమధ్య కాలం లో ఇలాంటివి బాగా తగ్గాయి. ఒకవేళ చేసినా ఆడియన్స్ అంగీకరించే పరిస్థితి లో లేరు. ‘సైరా నరసింహా రెడ్డి’ చిత్రం లో చిరంజీవి కి సతీమణి గా నటించిన నయనతార, అదే చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ చిత్రం లో ఆయనకు చెల్లిగా నటించింది. ఆడియన్స్ దీన్ని అంగీకరించలేకపోయారు , ఫలితంగా పెద్ద ఫ్లాప్ అయ్యింది. కానీ రీసెంట్ గానే చిరంజీవి , నయనతార భార్య భర్తలు గా నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం మాత్రం పెద్ద హిట్ అయ్యింది. అంటే దీని అర్థం ఒక్కసారిగా హీరో హీరోయిన్లు గా చూసిన వాళ్ళను , అన్నా చెల్లి గా ఆడియన్స్ చూడడం కష్టం అని.

అయితే ఇలాంటి అరుదైన సంఘటన భవిష్యత్తులో నేచురల్ స్టార్ నాని కి కూడా ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయా అంటే , అవుననే అంటున్నారు విశ్లేషకులు. పూర్తి వివరాల్లోకి వెళ్తే నాని కెరీర్ లో ‘హాయ్ నాన్న’ చిత్రం ఎంత ప్రత్యేకమో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ‘దసరా’ తర్వాత నాని నుండి విడుదలైన ఈ చిత్రానికి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. నెట్ ఫ్లిక్స్ లో అయితే ఈ చిత్రానికి 25 మిల్లియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. అలాంటి సినిమాలో నాని కి కూతురు గా నటించిన హీరోయిన్ మీకు గుర్తుందా?, ఆమె మరెవరో కాదు రితికా నాయక్. సినిమా చివర్లో నాని కూతురు పెరిగి పెద్దయ్యాక , ఒక మ్యూజిక్ లైవ్ పెర్ఫార్మన్స్ ఇస్తూ కనిపిస్తుంది. ఆమెనే రితికా నాయక్.

రీసెంట్ గానే ఈమె వరుణ్ తేజ్ హీరో గా నటించిన సూపర్ హిట్ చిత్రం ‘కొరియన్ కనకరాజు’ లో హీరోయిన్ గా నటించిన సంగతి అందరికీ తెలిసిందే. కెరీర్ లో ఇప్పటి వరకు ఈమె హీరోయిన్ గా నటించిన సినిమాలన్నీ ఒక దానిని మించి ఒకటి హిట్ అవుతూ వస్తున్నాయి. టాలీవుడ్ లో త్వరలోనే ఈమె మోస్ట్ డిమాండ్ ఉన్న హీరోయిన్స్ లో ఒకరిగా మారబోతుంది. కాబట్టి కచ్చితంగా భవిష్యత్తులో ఈమె నాని తో కలిసి హీరోయిన్ గా నటించే అవకాశం లేకపోలేదు. అదే కనుక జరిగితే ఆడియన్స్ ఆ చిత్రానికి ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper